Sirivennela Seetharama Sastry : మొదటి అడుగు నువ్వు వేస్తే సమాజం నీ వెనుక వస్తుంది..

Sirivennela Seetharama Sastry : మొదటి అడుగు నువ్వు వేస్తే సమాజం నీ వెనుక వస్తుంది..
Sirivennela Seetharama Sastry : అలనాటి కవుల బాణీలకు సౌరభాలద్ది మైమరపించాడు సీతారామ శాస్త్రి.

Sirivennela Seetharama Sastry : ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపుకు అంటూ మొదటగా ముందడుగు నువ్వు వేస్తే.. సమాజం నీ వెనుక వస్తుంది అని చెప్పాడు. రాసిన ప్రతి పాటలో విలువైన పదాలు పొదిగి ఆ గీతానికి ఓ ప్రత్యేకతను తీసుకురావడంలో సీతారామశాస్త్రి స్టైలే వేరు.

సమాజాన్ని సంస్కరించే గీతాలే కాదు.. అలనాటి కవుల బాణీలకు సౌరభాలద్ది మైమరపించాడు సీతారామ శాస్త్రి. స్వర్ణకమలంలో ఆన రాసిన ఓం నమో నమ: శివాయ అంటూ ఆయన రాసిన పదాలు ఓంకారనాదంలా మన చెవుల్లో ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది.

అందెల రవళికి పదముల తానై అనే చరణం.. భాను ప్రియ చేసిన నాట్యానికి ఆభరణం అయింది. రాంగోపాల్ వర్మ తీసిన మనీ చిత్రంలో భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరు భర్తకు మారకు బ్యాచిలరు అనే గీతం ఆధునిక బ్రహ్మచారులు అలవోకగా పాడేసుకున్నారు.

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అని చక్రం సినిమాలో ఆయన రాసిన పాట ఆయనలోని తాత్వికుడ్ని తట్టి లేపింది. కవినై, కవితనై, భార్యనై, భర్తనై, అన్నీ తానై అంటూనే అందరూ ఉన్నా నా జీవితం ఒంటరి అంటాడు ఆ పాటలో. తెలుగులో దాదాపు అందరి హీరోలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన సీతారామశాస్త్రి ఇక లేరని తెలిసి సినీ సాహిత్య లోకం కన్నీళ్లు పెట్టుకుంటోంది.

Tags

Read MoreRead Less
Next Story