సినిమా

Krithi Shetty: సుకుమార్ బంపరాఫర్.. కృతిశెట్టికి క్రేజీ ఛాన్స్..!

Krithi Shetty: భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది ఈ చిత్రం. అయితే ఈ సినిమాకి కొనసాగింపుగా పుష్ప 2 కూడా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు.

Krithi Shetty: సుకుమార్ బంపరాఫర్.. కృతిశెట్టికి క్రేజీ ఛాన్స్..!
X

Krithi Shetty: ఉప్పెనతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కృతిశెట్టి వరుస అవకాశాలను సొంతం చేసుకుంటోంది.. నాని హీరోగా నటిస్తున్న శ్యామ్‌సింగరాయ్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాతో పాటుగా నాగార్జున బంగార్రాజు సినిమాలో చైతూకి జోడీగా నటిస్తోంది. ఈ క్రమంలో కృతిశెట్టికి బంపరాఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో పుష్ప సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది ఈ చిత్రం.


అయితే ఈ సినిమాకి కొనసాగింపుగా పుష్ప 2 కూడా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. సుకుమార్ అంటేనే ప్రతి చిత్రంలో ఐటెం సాంగ్ కంపల్సరీ. పుష్ప పార్ట్ 1లో సమంతతో ఐటెం సాంగ్ చేయించారు సుకుమార్.. ఈ పాట పుష్ప సినిమాని ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది.

అయితే పార్ట్‌2 లో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ఉప్పెన బ్యూటీని రంగంలోకి దించేందుకు సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే ఈ విషయంపై మేకర్స్ స్పందించాల్సి ఉంది. ఉప్పెన చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సుకుమార్ సహనిర్మాతగా కూడా వ్యవహరించారు.


ఈ సినిమాకి కృతిశెట్టిని హీరోయిన్‌గా తీసుకోవడంలో సుకుమార్ పాత్ర కీలకం. బేబమ్మగా కృతి శెట్టి అలరించింది. మొదటి సినిమాతోనే ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ క్రమంలో సుకుమార్ ఆమెకు పుష్ప రూపంలో మరో ఆఫర్ ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల టాక్.

ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న కృతికి ఐటెం సాంగ్ ఆఫర్ రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఒకప్పుడు ఐటెం సాంగ్ అంటే ఫేడ్ అవుట్ అవుతున్న హీరోయిన్లు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు టాప్ హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్‌‌లో మెరుస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణ సమంతనే.

Next Story

RELATED STORIES