Shabaash Mithu Trailer: శభాష్ మిథు ట్రైలర్: మిథాలీగా ఒదిగిపోయిన తాప్సీ పన్ను..

Shabaash Mithu Trailer: శభాష్ మిథు ట్రైలర్: మిథాలీగా ఒదిగిపోయిన తాప్సీ పన్ను..
Shabaash Mithu Trailer: మంచి టాలెంట్ ఉన్న నటి తాప్సీ పన్ను 'శభాష్ మిథు'లో మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ పాత్రను పోషిస్తోంది. ఇది ఆసక్తికరమైన కథాకథనంతో పాటు పోరాటాల మధ్య ఆమె క్రికెటర్ గా ఎదిగిన తీరు గురించి చెబుతుంది.

Shabaash Mithu Trailer: మిథాలీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న శభాష్ మిథు ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ కు సంబంధించిన గ్రిప్పింగ్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇది రిటైర్డ్ క్రికెటర్ మిథాలీ రాజ్ యొక్క పోరాటాలను, విజయాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

తాప్సీ మిథాలీగా నటించింది. ఇందుకోసం క్రికెట్ బ్యాట్ చేతబట్టి ఆటలో నైపుణ్యాలను అవపోసన పట్టింది. దృఢ సంకల్పంతో తన పాత్రకు వంద శాతం న్యాయం చేసే ప్రయత్నం చేసింది. ఆ విషయం ట్రైలర్ లో స్పష్టమవుతోంది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాప్సీ క్రికెటర్‌ మిథాలీగా నటించింది.

రెండు నిమిషాల 44 సెకన్ల నిడివి గల ట్రైలర్ తాప్సీ మైదానంలో ఒకదాని తర్వాత ఒకటిగా ఫోర్లు మరియు సిక్సర్లు కొట్టడంతో ప్రారంభమవుతుంది. ఇది తన అన్న కొట్టిన బంతిని క్యాచ్‌ చేస్తూమిథాలీ బాల్యానికి తీసుకు వెళుతుంది.

ఆమె ప్రతిభను గమనించి తల్లిదండ్రులు ఆటలో ప్రోత్సహిస్తారు. శిక్షణ తీసుకునే సమయంలో తోటి ఆటగాళ్లు ఆమెను 'ఇంగ్లీష్ మీడియం' అమ్మాయిగా చిన్నచూపు చూస్తారు. ఈ క్రమంలోనే ఆమె ఆటలో పైకి ఎదుగుతుంది.

మగ క్రికెటర్లకు ధీటుగా వారి స్వంత పేర్లతో జట్టు జెర్సీలను పొందడం కోసం తన స్వరాన్ని కూడా ఎలా పెంచింది అనేది, అందుకోసం ఆమె పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. మిథాలీని ప్రశంసిస్తూ, తాప్సీ ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది, "క్రికెటర్లు తమ పేరుతో రికార్డులు కలిగి ఉన్నారు. విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంటుంది క్రికెటర్లకు. మీకు స్ఫూర్తినిచ్చే క్రికెటర్లు ఉన్నారు. మీరూ చేయగలరు.. మిమ్మల్ని మీరు నమ్మండి.. మిధాలీ కూడా అదే చేసింది. తన శైలితో మహిళల ఉనికికి సంబంధించిన క్రికెట్ ఆటను కూడా మార్చింది." అని తాప్పీ వివరించింది.

తాప్సీ ఇంకా ఇలా చెప్పింది, "మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్‌కు ఆమె చేసిన కృషి ఆమెని ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసింది. 23 సంవత్సరాల సుదీర్ఘ క్రికెట్ చరిత్ర కలిగిఉన్న తన అద్భుతమైన ప్రయాణాన్ని తెరపై నేను చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె నిజంగా ఒక లెజెండ్. ఆమెకు మనం ఎప్పటికీ కృతజ్ఞతలు కలిగి ఉండాలి అని తాప్సీ పేర్కొంది. కాగా, శభాష్ మిథు జూలై 15న థియేటర్లలోకి రానుంది.

Tags

Read MoreRead Less
Next Story