Tamannah: చిరుతో జతకట్టనున్న మిల్కీబ్యూటీ.. భారీ పారితోషికం డిమాండ్..

Tamannah: చిరుతో జతకట్టనున్న మిల్కీబ్యూటీ.. భారీ పారితోషికం డిమాండ్..
Tamannah: ఒకవైపు కధానాయికగా, అప్పుడప్పుడు ఐటెమ్ సాంగ్స్‌లో ఆడిపాడుతూ మొత్తానికి తన సినిమా కెరీర్‌ని కొనసాగిస్తోంది.

Tamannah: మెగాస్టార్ సినిమాలో మరోసారి ఛాన్స్ కొట్టేసింది తమన్నా. ఒకవైపు కధానాయికగా, అప్పుడప్పుడు ఐటెమ్ సాంగ్స్‌లో ఆడిపాడుతూ మొత్తానికి తన సినిమా కెరీర్‌ని కొనసాగిస్తోంది. ఈ మధ్య అవకాశాలు తగ్గినట్లే అనిపించినా మెగాస్టార్‌తో 'భోళా శంకర్' సినిమాలో అవకాశం రావడం ఆమెకి కలిసొచ్చింది.

మెహర్ రమేశ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేష్ కీలక పాత్ర పోషిస్తోంది. తమన్నా మెయిన్ రోల్ కావడంతో భారీగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. భోళా శంకర్ కోసం ఆమె దాదాపు రూ.3 కోట్లు అందుకోనున్నట్లు టాలీవుడ్ టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అమ్మడు స్పందించాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story