సినిమా

Dhanush: శివశంకర్ మాస్టర్ వైద్యానికి ధనుష్ సాయం..

Dhanush: తాజాగా మరో తమిళ్ స్టార్ హీరో ధనుష్ కూడా మాస్టారికి వైద్యం చేయిస్తానని ముందుకొచ్చారు.

Dhanush: శివశంకర్ మాస్టర్ వైద్యానికి ధనుష్ సాయం..
X

Dhanush: రీల్ హీరోలు రియల్ హీరోలు అయితేనే ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. సామాన్యులకు ఆపద వస్తేనే తక్షణం స్పందించే సోనూసూద్ సీనియర్ కొరియోగ్రాఫర్ విషయంలోనూ వెంటనే స్పందించారు. ఆయన వైద్యానికి అయ్యే ఖర్చులను తాను భరిస్తానన్నారు.

తాజాగా మరో తమిళ్ స్టార్ హీరో ధనుష్ కూడా మాస్టారికి వైద్యం చేయిస్తానని ముందుకొచ్చారు. మాస్టారికి ఇప్పటికే 75 శాతం ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాయని, ప్రమాద స్ధితిలో ఉన్నారని వైద్యుల సమాచారం. హాస్పిటల్ ఖర్చులు రోజుకు దాదాపు లక్షరూపాయలు అవుతోందని తెలుస్తోంది.

అంత ఖర్చు భరించలేక దాతల సాయం కోరుతున్నారు మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ. ఆయనతో పాటు కుటుంబం కూడా కరోనా బారిన పడడంతో నిస్సహాయస్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు కుటుంబసభ్యులు. మాస్టర్ సతీమణి కరోనా నుంచి కోలుకుని హోం క్వారంటైన్‌లో ఉండగా, పెద్ద కుమారుడికి సీరియస్ అయ్యి అపస్మారక స్థితిలో ఉన్నాడు.

Next Story

RELATED STORIES