సినిమా

Siddharth: ఎందుకిలా చేస్తున్నారు: సిద్ధార్థ్ ఆవేదన

ట్విట్టర్ వేదికగా ఆ ఫోటోని చూపిస్తూ కావాలనే నన్ను ఇలా వేధిస్తున్నారు.. ద్వేషిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

Siddharth: ఎందుకిలా చేస్తున్నారు: సిద్ధార్థ్ ఆవేదన
X

Siddharth: మాటా మాటా అనుకోవడం మామూలే.. కానీ ఆ మాటలు ఓ మనిషిని బతికుండగానే చంపేస్తే.. ఆ స్థానంలో మనమే ఉంటే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి అని టాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా నిన్న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు సంతాపం తెలుపుతూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో శుక్లా ఫోటోకి బదులు సిద్ధార్థ్ ఫోటో ఉంచి సంతాపం ప్రకటించారు. అది కాస్తా సిద్ధార్ధ్ వద్దకు చేరి ఆయన మనసును బాధపెట్టింది.

ట్విట్టర్ వేదికగా ఆ ఫోటోని చూపిస్తూ కావాలనే నన్ను ఇలా వేధిస్తున్నారు.. ద్వేషిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన సిద్ధార్ధ్.. ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం చేస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సినిమాలో మరో హీరో శర్వానంద్ కూడా ఉన్నాడు.

Next Story

RELATED STORIES