సినిమా

Big Boss Season 5: జీవితమే ఒక ఆట టాస్క్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది..

Big Boss Season 5: ఒక్కో వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ ఇప్పడు 11 మంది ఇంటి సభ్యులు ఉన్నారు.

Big Boss Season 5: జీవితమే ఒక ఆట టాస్క్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది..
X

BiggBoss Season 5: మొత్తం 19 మంది ఇంట్లోకి వచ్చారు.. ఒక్కో వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ ఇప్పడు 11 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. దిగ్విజయంగా ఎనిమిది వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 9వ వారంలోకి అడుగు పెట్టింది. ఇప్పటికే 8మంది బయటకు వచ్చారు. అయితే ఈ వారం నామినేషన్స్‌లో కెప్టెన్ మినహా మిగతా ఇంటి సభ్యులంతా ఉన్నారు. ఇంట్లో ఉన్న 11 మందిలో 10 మంది నామినేషన్ లోకి వచ్చారు. యానీ మాస్టర్, విశ్వలు సైతం నామినేషన్స్‌లోకి వెళ్లారు. షణ్ముఖ్ కెప్టెన్ కావడం వల్ల నామినేషన్స్ అతడికి వర్తించదు. సో ఆ విధంగా షణ్ణూ సేవ్ అయ్యాడు.

తాజాగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఓ ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్ ఉన్నవాళ్లలో ఇద్దరికి ఇమ్యూనిటీ వచ్చేలా చేశాడు. ఇందుకోసం జీవితమే ఒక ఆట అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో యానీ మాస్టర్ విజయం సాధించింది. అలాగే ఆమెకు గతంలో లభించిన స్పెషల్ పవర్ ద్వారా మానస్ ని కూడా ఎలిమినేషన్ నుంచి తప్పించింది. దీంతో ఈ వారం నామినేషన్‌లో సన్ని, శ్రీరామచంద్ర, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, విశ్వ ఉన్నారు. వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే శనివారం వరకు ఆగాల్సిందే.

Next Story

RELATED STORIES