Brahmaji : ఇండస్ట్రీలో జరిగే మోసాలపై హెచ్చరించిన టాలీవుడ్ నటుడు

Brahmaji : ఇండస్ట్రీలో జరిగే మోసాలపై హెచ్చరించిన టాలీవుడ్ నటుడు
చీటెడ్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలంటున్న బ్రహ్మాజీ

ఏ ఇండస్ట్రీలోనైనా మోసాలనేవి జరుగుతుంటాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో అయితే కాస్త ఎక్కువ జరుగుతాయన్నది అవాస్తవేం కాదు. సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్న వారు ఆ మోసగాళ్లకు ఇట్టే చిక్కుతుంటారు. వారికి ఉన్నదంతా సమర్పించుకుంటారు. చివరకు మోసపోయామని గ్రహించి బోరుమనడం కొత్తేం కాదు. పెద్ద పెద్ద సెలెబ్రిటీలే వారి మేనేజర్ల చేతిలో దెబ్బలు తిని.. రోడ్డు మీదకు వచ్చారు. కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నారు. ఇక సినిమా మీద ఆశ, ప్యాషన్‌తో వచ్చే వారు ఇంకెన్ని మోసాలకు గురవుతుంటారో చెప్పాల్సిన పని లేదు. అలా జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు బ్రహ్మాజీ ముందడుగు వేశారు.

నటరాజ్ అన్నాదురై.. లోకేష్ కనకరాజ్ మేనేజర్ అంటూ ఫోన్ వస్తుంది.. నెక్ట్స్ సినిమాలో ఓ రోల్ ఉంది.. కాకపోతే ఆడిషన్ ఇవ్వాలి.. వారి ఇచ్చే క్యాస్టూమ్‌లోనే ఆడిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.. ఆ క్యాస్టూమ్ రెంట్‌కు డబ్బు కట్టండి.. ఆడిషన్స్‌లో సెలెక్ట్ అయితే మళ్లీ రీఫండ్ చేస్తారు అని ఇలా కాల్ చేస్తారు.. మోసం చేస్తారు.. తస్మాత్ జాగ్రత్త అని ఆ నంబర్‌ను కూడా ట్వీట్ చేశాడు.

ఇలానే చాలా జరుగుతున్నాయని, ఇంకో వ్యక్తి తమిళ నాడు నుంచి ఫోన్ చేస్తాడని, సత్యదేవ్ అని చెబుతాడు అని.. కొత్తగా సినిమాల్లోకి వచ్చే వారిని టార్గెట్ చేస్తుంటాడని, కొత్త యాక్టర్ల నుంచి నాకు వాడిపై కంప్లైంట్స్ వస్తున్నాయి.. మీరంతా జాగ్రత్తగా ఉండాలి.. వాడు ఫోర్బ్స్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ తిరుగుతాడట.. అని బ్రహ్మాజీ అందరినీ హెచ్చరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో జరుగుతున్న మోసాలపై బ్రహ్మాజీ చేసిన ఈ పోస్టు.. ఇప్పుడు నెట్టింట్లో తెగ షేర్ అవుతోంది. ప్రస్తుతం వరుసగా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన.. ఏడాదికి కనీసం అరడజనకు పైగా సినిమాల్లో కనిపిస్తూ ఉన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story