సినిమా

Boyapati: బోయపాటికి బంపరాఫర్.. ఆ స్టార్ హీరోతోనే నెక్ట్స్ సినిమా..!!

Boyapati: అఖండ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో బోయపాటి ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఆయనకి బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

Boyapati: బోయపాటికి బంపరాఫర్.. ఆ స్టార్ హీరోతోనే నెక్ట్స్ సినిమా..!!
X

Boyapati: అఖండ సినిమాతో మరోసారి బోయపాటి పేరు మారుమోగిపోతోంది. బోయపాటి రేంజ్ ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రేక్షకులకి తెలిసినా.. అఖండ సినిమా చూసి స్టార్ హీరోలు అతడితో సినిమా చేయాలని ఉబలాటపడుతున్నారు. అఖండ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో బోయపాటి ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఆయనకి బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.


అదేంటంటే బోయపాటితో సినిమా చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయట. దీంతో బోయపాటి చెప్పిన లైన్ చిరంజీవికి కూడా బాగా నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ఇందులో చిరు డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం యంగ్ డైరక్టర్లకి వరుసగా ఆఫర్స్ ఇస్తున్నారు చిరంజీవి.

ఈ క్రమంలో బోయపాటిని కూడా ఆ లిస్ట్‌లో చేర్చినట్లు తెలుస్తోంది. వీరి కాంబినేషన్‌లో వచ్చే చిత్రమంటే ఫ్యాన్స్‌కి కూడా ఎగ్జైట్‌మెంట్ ఉండడం ఖాయమే.. ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అంతరకు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే.. కాగా, గతంలో మెగా హీరోలైన అల్లు అర్జున్, రాంచరణ్‌లతో సినిమాలు తెరకెక్కించారు బోయపాటి.

Next Story

RELATED STORIES