Chiranjeevi : పూరీ కల నెరవేర్చిన గాఢ్ ఫాదర్..

Chiranjeevi : పూరీ కల నెరవేర్చిన గాఢ్ ఫాదర్..
Chiranjeevi : నటుడిగా ఓ వెలుగు వెలగాలనే ఉద్దేశంతో నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు హైదరాబాద్ వచ్చాడు.

Chiranjeevi : ఇండస్ట్రీకి వచ్చింది హీరో అవ్వాలని.. కానీ పరిస్థితులు అతడిని డైరెక్టర్ ని చేశాయి. అయితేనేం ఆయన చిత్రాల్లో నటించిన హీరోలందరికీ హిట్స్ ఇచ్చాడు.. ఎన్ని చిత్రాలు చేసినా హీరో అవ్వాలన్న కోరిక అలా మిగిలిపోయింది. అది గాడ్ ఫాదర్ తో నెరవేరింది.. పూరి కలను నిజం చేశారు మెగాస్టార్ చిరంజీవి. తాను నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ లో ఓ స్పెషల్ రోల్ కోసం పూరీని సజెస్ట్ చేశారు చిరంజీవి చిత్ర యూనిట్ కి. వారు కూడా ఓకే చెప్పడంతో పూరిపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేసింది గాడ్ ఫాదర్ టీమ్. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న చిరంజీవి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.

వెండితెరపై నటుడిగా ఓ వెలుగు వెలగాలనే ఉద్దేశంతో నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేశాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అతడి మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.. అందుకే ఇలా అని చిరు పేర్కొన్నారు.

మలయాళీ లూసీఫర్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూరీ జర్నలిస్ట్ గా కనిపించనున్నడని సమాచారం. చిరంజీవి, పూరీతో పాటు నయనతార, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ థమన్ అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story