సినిమా

SS Rajamouli: ఓ అమ్మాయిపై ఎట్రాక్షన్.. నిజమైన ప్రేమ ఆమెని చూసిన తరువాతే: రాజమౌళి లవ్ స్టోరీ

SS Rajamouli: సినిమాల్లో ఆయన కురిపించే ప్రేమ సన్నివేశాలు ఆయన జీవితంలో కూడా ఉన్నాయని ఓపెన్ అయ్యారు.

SS Rajamouli: ఓ అమ్మాయిపై ఎట్రాక్షన్.. నిజమైన ప్రేమ ఆమెని చూసిన తరువాతే: రాజమౌళి లవ్ స్టోరీ
X

SS Rajamouli: రాజమౌళి మార్కు కొన్ని సినిమాలకు ప్రత్యేకం. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనది.. సినిమాల్లో ఆయన కురిపించే ప్రేమ సన్నివేశాలు ఆయన జీవితంలో కూడా ఉన్నాయని ఓపెన్ అయ్యారు. డైరెక్టర్ అవుదామని చాలా నమ్మకంతో ఇండస్ట్రీకి వచ్చాను. కానీ దాదాపు సంవత్సరంన్నర ఖాళీగా ఉన్నాను. పోనీ ఏదైనా ఉద్యోగం చేద్దామంటే నెలకు రూ.15వేల కంటే ఎక్కువ రావు.. ఏం చేయాలి అని ఆలోచించాను.. అని పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిన రాజమౌళి అన్న మాటలే ఇవి. వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకా ఇదే వేదికపై ఆయన లవ్ స్టోరీ గురించి కూడా వివరించారు.

డైరెక్టర్ గా తనపై తనకు నమ్మకం తగ్గిపోవడానికి కారణం ఒక అమ్మాయితో లవ్, అట్రాక్షన్, భయం కూడా.. ఇంతకీ భయం ఎందుకు వేసిందంటే.. ఒక్కసారి కమిట్ అయ్యామంటే.. పెళ్లి, పిల్లలు.. సినిమా అంటే నిలకడలేని వృత్తి, సక్సెస్ ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఆ అమ్మాయి పట్ల నాకు కలిగింది ప్రేమ అనుకున్నాను కానీ అది ఇన్‌ఫ్యాక్ష్యుయేష‌న్. నిజమైన ప్రేమ నా భార్యను చూసిన తరువాతే కలిగింది. ఒకానొక టైమ్ లో నేను నా భార్య సంపాదన మీద ఆధారపడ్డాను. కానీ అందుకు నేనేమీ సిగ్గుపడలేదు అని అన్నారు రాజమౌళి.

కాగా, ఈ స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న RRR మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. కొమురం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం 1940 బ్యా్క్ డ్రాప్ లో రూపొందించినది. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులతో పాటు, ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Next Story

RELATED STORIES