టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో పూరీని విచారించిన ఈడీ

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో పూరీని విచారించిన ఈడీ
Tollywood: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ లోతుగా విచారణ చేస్తోంది. హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌లో సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ఈడీ అధికారులు దాదాపు 10 గంటలు ప్రశ్నించారు.

Tollywood: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ లోతుగా విచారణ చేస్తోంది. హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌లో సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ఈడీ అధికారులు దాదాపు 10 గంటలు ప్రశ్నించారు. 2015 నుంచి 2017 మధ్య పూరీ జగన్నాథ్‌ బ్యాంక్ లావాదేవీల్ని పరిశీలించింది. ఇందుకు సంబంధిత బ్యాంకుల నుంచి సమాచారం తీసుకుంది. విదేశీ లావాదేవీలు, పలు చెల్లింపులపై లంచ్‌ బ్రేక్‌ ముందు ప్రశ్నలు అడిగారు. గంట పాటు లంచ్‌ బ్రేక్‌ ఇచ్చిన తర్వాత తిరిగి మళ్లీ విచారించారు. అలాగే మనీలాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘనలు నిర్థారించుకునేందుకు పలు ప్రశ్నలు అడిగారు. హవాలా రూపంలో డబ్బులు తరలించారా అని అంశంపై విచారించారు. రాతపూర్వకంగా స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు.

అటు.. డ్రగ్స్‌ గొనుగోళ్ల కోసం డబ్బులు ఎలా పంపారని ఛార్టెడ్ అకౌంటెంట్ల ద్వారా లావాదేవీల్ని ఈడీ బృందం పరిశీలించింది. డ్రగ్స్ తీసుకున్నారా? తీసుకుంటే అవి ఎలా వచ్చాయి..? అని కోణంలో ప్రశ్నించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కొనుగోళ్ల లావాదేవీలు ఎలా జరిగాయనే కోణంలో ఆరా తీశారు. డ్రగ్స్‌ కొనుగోలు కోసం డబ్బులు.. నేరుగా పంపించారా? మధ్యవర్తుల పంపారా అనే కోణంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూరీ జగన్నాథ్‌ తన ఆడిటర్‌తో కలిసి విచారణకు హాజరయ్యారు. ఇరువురినీ విడివిడిగా ప్రశ్నించారు. పూరీని మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

అటు ఈడీ కార్యాలయానికి నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆఫీసులోకి వెళ్లి కాసేపటి తర్వాత బయటకు వచ్చిన బండ్ల గణేష్‌... కేసుతో తనకు ఏం సంబంధం లేదని స్పష్టంచేశారు. పూరీని కలవనీయని ఈడీ అధికారులు బండ్ల గణేష్‌ నుంచి సమాచారం తీసుకున్నారు. అయితే బండ్ల గణేష్‌ ప్రొడ్యూసర్‌గా పూరీ పలు చిత్రాలు తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్‌ నుంచి ఎలాంటి సమాచారం తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story