సినిమా

Prabhas 25th Movie : కొరియన్‌ బ్యూటీతో ప్రభాస్..!

Prabhas 25th Movie : బహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా మూవీస్ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నాడు.

Prabhas 25th Movie : కొరియన్‌ బ్యూటీతో ప్రభాస్..!
X

Prabhas 25th Movie : బహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా మూవీస్ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నాడు. అందులో భాగంగానే ప్రభాస్ 25వ చిత్రం 'స్పిరిట్‌' సందీప్‌ వంగ డైరెక్షన్‌లో తెరకెక్కబోతుంది. ఈ సినిమాని టీ సిరీస్‌, వంగా పిక్చర్స్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏకంగా 8 భాషల్లో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు మేకర్స్.

ఇదిలావుండగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకి అదేంటంటే.. కొరియన్‌ టీవీ డ్రామాలతో ఫేమ్ సంపాదించుకున్న సాంగ్ హై క్యో(Song Hye-Kyo)ను ఈ మూవీలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించారని, ఆమెకూడా ప్రభాస్ తో మూవీ చేసేందుకు ఒకే చెప్పినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Next Story

RELATED STORIES