Prema Desam: ప్రేమదేశం సినిమాను మిస్ చేసుకున్న టాప్ హీరోయిన్..

Prema Desam: ప్రేమదేశం సినిమాను మిస్ చేసుకున్న టాప్ హీరోయిన్..
Prema Desam: ముంబైకి చెందిన మోడల్ అబ్బాస్.. బెంగళూరు వచ్చాడు సెలవుల్ని ఎంజాయ్ చేసేందుకు..

Prema Desam: అందమైన ప్రేమ కథను ఆడియన్స్‌కి ఎలా చెబితే రిసీవ్ చేసుకుంటారో అలానే చెప్పాడు ప్రేమదేశం డైరెక్టర్ కతీర్.. అందుకే ఆ చిత్రం యువ హృదయాలను గిలిగింతలు పెట్టింది.. సాదాసీదా ప్రేమకథగా చూపిస్తే సాధారణ ప్రేక్షకుడు రిసీవ్ చేసుకోడు.. దానికి కొంత నాటకీయత జోడిస్తేనే సక్సెస్ అవుతాననుకున్నాడు. అందుకే ఆ విధంగా స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల చుట్టూ తిరిగే ప్రేమకథ.

ఇందులో నటించిన హీరోలని కూడా వెరైటీగా సెలెక్ట్ చేసుకున్నాడు దర్శకుడు కతీర్. ముంబైకి చెందిన మోడల్ అబ్బాస్.. బెంగళూరు వచ్చాడు సెలవుల్ని ఎంజాయ్ చేసేందుకు.. ఓ రోజు బ్రిగేడ్ రోడ్ సమీపంలోని సైబర్ కేఫ్‌లో కాఫీ తాగుతున్నాడు.



కతీర్ అతడిని చూసి తన సినిమాకు అతడే హీరో అనుకున్నాడు.. వెంటనే వెళ్లి అడిగాడు.. నాకు తమిళ్ రాదు, నేను చెయ్యను.. నన్ను వదిలేయండి అని ముంబై ట్రెయిన్ ఎక్కేశాడు.. ఆ విషయాన్ని మర్చిపోయి కాలేజీకి వెళ్లి బుద్దిగా చదువుకుంటున్నాడు అబ్బాస్. నిరాశగా వెనుదిరిగాడు కతీర్.. కానీ తన మనసులో అబ్బాస్ అలానే ఉండిపోయాడు.

కతీర్ స్క్రిప్ట్ పట్టుకుని నిర్మాత కుంజుమోహన్ దగ్గరకు వెళ్లాడు.. అతడికి కథ బాగా నచ్చింది.. అయితే టైటిల్ మార్చమని పట్టుబడ్డాడు.. దాంతో కల్లూరి సాలై కాస్తా కాదల్ దేశం (తెలుగులో ప్రేమ దేశం)గా మారిపోయింది. నటీనటుల ఎంపిక చేశావా అంటే అబ్బాస్ పేరు చెప్పాడు కతీర్.. కుంజుమోహన్ అబ్బాస్‌కి ఫోన్ చేసి అర్జంట్‌గా చెన్నై స్క్రీన్ టెస్ట్‌కి రమ్మన్నాడు.. మరో హీరో వినీత్‌ని అనుకున్నాడు కుంజుమోహన్..



బాలీవుడ్‌లో చిత్రాలు చేస్తున్న టబుకి తమిళంలో అదే మొదటి చిత్రం. ఆమెకంటే ముందు ఈ సినిమాకి ఫ్యామిలీ చిత్రాలతో పేరు తెచ్చుకుని ఫుల్ బిజీగా ఉన్న దేవయానిని అనుకున్నారు.. కానీ ఆమె ఈ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయింది. దాంతో టబుకి ఆ అవకాశం వచ్చింది. ఈ సినిమా తరువాత టబు యువకుల కలలరాణి అయిపోయింది. వరుస సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది.



సినిమా రీలీజ్ అయినప్పుడు ఒక స్టూడెంటూ కాలేజీలో లేడు.. అందరూ థియేటర్లలోనే. ఒకటి రెండు సార్లు వరుసగా వారం రోజుల పాటు సినిమా చూసిన వాళ్లు కూడా ఉన్నారు.. ఎక్కడైనా స్నేహితులు తారసపడితే ఏంరా ఎన్నోసారి చూడ్డం అని అడిగేవారంటే ఆ సినిమాకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు.



ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేఫం ఏంటంటే.. ఇప్పుడు తమిళంలో మంచి పేరున్న నటుడు విక్రమ్.. అప్పుడు చాలా కష్టాల్లో ఉన్నారు.. హీరోగా కాకపోయినా డబ్బింగ్ అయినా ఓకే అంటూ అబ్బాస్‌కి డబ్బింగ్ చెప్పాడు.. డబ్బింగ్ ఆర్టిస్ట్ శేఖర్.. వినీత్‌కి డబ్బింగ్ చెప్పగా.. టబుకి ప్రముఖ నటి సరిత డబ్బింగ్ చెప్పారు. టాలీవుడ్‌లో హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎ. కరుణాకరన్ ఈ చిత్రంలో క్లాప్ అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించారు.

ఈ ముక్కోణపు ప్రేమకథా చిత్రంలో పాటలన్నీ సూపర్ హిట్. 'ముస్తఫా ముస్తఫా' పాట మ్యానియా దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన ఏఆర్ రెహమాన్‌కి ఫిల్మ్‌ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. ఆనంద్ ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా అవార్డును అందుకున్నారు. తెలుగులో ప్రేమదేశం పేరుగతో విడుదలై అతి పెద్ద విజయాన్ని సాధిస్తే.. హిందీలో మాత్రం నిరాశే ఎదురైంది.

Tags

Read MoreRead Less
Next Story