Trivikram-Mahesh Movie: త్రివిక్రమ్ కొత్త సినిమా.. ఆ నటులు రిపీట్..

Trivikram-Mahesh Movie: త్రివిక్రమ్ కొత్త సినిమా.. ఆ నటులు రిపీట్..
Trivikram-Mahesh Movie: దర్శకుడు త్రివిక్రమ్ కు ఓ అలవాటుంది. తనకు కంఫర్ట్ గా ఉన్న ఆర్టిస్టులను బాగా రిపీట్ చేస్తుంటాడు.

Trivikram-Mahesh Movie: దర్శకుడు త్రివిక్రమ్ కు ఓ అలవాటుంది. తనకు కంఫర్ట్ గా ఉన్న ఆర్టిస్టులను బాగా రిపీట్ చేస్తుంటాడు. ఒకప్పుడు ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం వంటి కమెడియన్స్ కోసం మంచి పాత్రలు రాసేవాడు. తర్వాత పాత ఆర్టిస్టులను కొత్తగా చూపించడం అత్తారింటికి దారేదీతో మొదలుపెట్టాడు.



ఈ మూవీ కోసం తెచ్చిన నదియా ఆల్మోస్ట్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయింది. అంతకు ముందు తమిళ్ లో కూడా తనను పట్టించుకున్నవారు లేరు. అలాగే బొమన్ ఇరానీని తెచ్చాడు. ఈశ్వరీరావు, ఖుష్బూ.. ఇలా చాలామందే ఉన్నారు. అయితే అల వైకుంఠపురములో కోసం ఏకంగా టబును తీసుకువచ్చి అల్లు అర్జున్ కు మదర్ అని మెప్పించాడు కూడా.



అదే సినిమాలో సచిన్ ఖేద్కర్, జయరామ్ లకూ మంచి పాత్రలే రాశాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో మూడో సినిమా చేస్తన్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రం కోసం అల వైకుంఠపురములోలో కీలక పాత్రలో నటించిన సచిన్ ఖేద్కర్ ను మళ్లీ తీసుకుంటున్నాడట. అలాగే టబును సైతం రిపీట్ చేస్తున్నాడు అని టాక్. సచిన్ వరకూ ఓకే. బట్ టబు అంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు చాలామంది.



అల్లు అర్జున్.. మహేష్‌ కంటే చిన్నవాడు కాబట్టి అతనికి అమ్మ అన్నా ఓకే అయింది. కానీ మహేష్‌ కు టబు మదర్ గా లేదా అత్తగా నటిస్తే వయసుకు సంబంధించి మరీ తక్కువ గ్యాప్ కనిపిస్తుంది. మహేష్‌ కు ఇప్పుడు 47యేళ్లు. టబుకు 52యేళ్లు. ఇద్దరి మధ్య కేవలం ఐదేళ్ల గ్యాప్ మాత్రమే ఉంది.



ఈ గ్యాప్ తో అత్త, అమ్మ అంటే ఆడియన్స్ నవ్వుతారేమో కానీ.. మహేష్‌ చూడ్డానికి 30ల్లోలాగా ఉంటాడు కాబట్టి వర్కవుట్ అయ్యే అవకావం ఉంది. ఏదేమైనా త్రివిక్రమ్ ఈ ఇద్దరినీ రిపీట్ చేస్తున్నట్టు ఇంకా అఫీషియల్ గా కన్ఫార్మ్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ ఖరారే అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story