సినిమా

VJ Sunny: సన్నీని ఉమాదేవి అల్లుడు అని పిలవడానికి కారణం ఇదే.. నిజంగానే అల్లుడు చేసుకుందామనుకొని..

VJ Sunny: ఫైనల్స్‌లో ఇంకా విన్నర్ ఎవరో తెలియని సమయంలో చాలామంది సన్నీనే గెలవాలని కోరుకుంటున్నామని చెప్పారు.

VJ Sunny: సన్నీని ఉమాదేవి అల్లుడు అని పిలవడానికి కారణం ఇదే.. నిజంగానే అల్లుడు చేసుకుందామనుకొని..
X

VJ Sunny: బిగ్ బాస్ 5 తెలుగుకు విన్నర్‌గా నిలిచాడు వీజే సన్నీ. జర్నలిస్ట్‌గా ప్రారంభమయిన తన కెరీర్.. ప్రస్తుతం బిగ్ బాస్ గెలవడం వరకు ఎన్నో ఒడుదుడుకులను చూసింది. అయితే జర్నలిస్ట్ నుండి వీజేగా.. అక్కడ నుండి సీరియల్ ఆర్టిస్ట్‌గా.. ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్‌గా మారిన సన్నీకి ఇప్పటివరకు అంత ఫ్యాన్ బేస్ లేకపోయినా.. ఈ రియాలిటీ షో అనేది ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టింది.

సన్నీకి బయటే కాదు బిగ్ బాస్ హౌస్ లోపల కూడా చాలానే ఫాలోయింగ్ ఉండేది. ఫైనల్స్‌లో ఇంకా విన్నర్ ఎవరో తెలియని సమయంలో చాలామంది సన్నీనే గెలవాలని కోరుకుంటున్నామని చెప్పారు. అందులో ఉమాదేవి కూడా ఒకరు. ఉమాదేవి బిగ్ బాస్ హౌస్‌లో వేర్వేరు మనస్తత్వాల మధ్య సర్దుకోలేక, ప్రేక్షకులను మెప్పించలేక.. రెండోవారమే బయటికి వచ్చేసినా.. తనకు సన్నీకి ముందు నుండే పరిచయం ఉంది.

సీరియల్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన తర్వాత సన్నీ.. తాను నటించిన మొదటి సీరియల్‌తోనే ఉమాదేవితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. దాదాపు మూడేళ్లు వీరు కలిసి పనిచేశారు. అయితే అప్పటినుండే సన్నీ ప్రవర్తనను ఇష్టపడడం మొదలుపెట్టిన ఉమాదేవి తనను నిజంగానే అల్లుడు చేసుకోవాలనుకుందట. తన పెద్దమ్మాయికి ఇచ్చి పెళ్లి కూడా చేయాలనుకుంది.

సన్నీని తన పెద్దమ్మాయికి పరిచయం చేయగానే ఆ అమ్మాయి తనను అన్నయ్య అనేసిందట. అప్పటినుండి వారి మధ్య అన్నాచెల్లల్ల బంధం ఏర్పడిందని ఉమాదేవి చెప్పింది. అలా సన్నీకి అత్త అవ్వాలనుకున్న ఉమాదేవి పిన్ని అయ్యింది. కానీ ఇప్పటికీ తనను ముద్దుగా అల్లుడు అనే పిలుచుకుంటుంది. అందుకే సన్నీ విన్నర్ అని తెలియగానే తానే ఎక్కువగా సంతోషించింది.

Next Story

RELATED STORIES