సినిమా

Upasana Konidela: సమంతను చూసి చాలా నేర్చుకున్నా.. : ఉపాసన

Upasana Konidela : మెగాస్టార్ కోడలైనా కొంచెం కూడా ఆటిట్యూడ్ చూపించని ఉపాసన.. స్టార్ హీరోయిన్లతో సరి సమానంగా అభిమానుల మనసు దోచుకుంది.

Upasana Konidela: సమంతను చూసి చాలా నేర్చుకున్నా.. : ఉపాసన
X

Upasana Konidela : మెగాస్టార్ కోడలైనా కొంచెం కూడా ఆటిట్యూడ్ చూపించని ఉపాసన.. స్టార్ హీరోయిన్లతో సరి సమానంగా అభిమానుల మనసు దోచుకుంది. సమంత, ఉపాసన బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. ఫిట్‌నెస్, ఆరోగ్యం, మహిళా సాధికారత వంటి అంశాలపై తరచు చర్చించుకుంటారు. ఈ క్రమంలోనే వారి మధ్య అనుబంధం బలపడింది. గతంలో ఉపాసన సొంత వెబ్‌సైట్ యువర్ లైఫ్.కో.ఇన్‌కు సామ్ గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో ఉపాసన.. సామ్ గురించి మాట్లాడుతూ..

నేను తెలంగాణ బిడ్డను.. దసరా వంటి పండుగల సమయంలో మాంసం తింటాను. అయితే సమంతతో మాట్లాడిన తరువాత మాంసం తినడం చాలా వరకు తగ్గించాను. సమంతలో సాయం చేసే గుణం ఉంది. ఎన్నో విషయాల్లో ఆమె నాకు సాయం చేసింది. సమంతది నిజమైన ప్రేమ అని ఉపాసన చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Next Story

RELATED STORIES