సినిమా

Upasana Konidela: మెగా కోడలుకు అరుదైన గౌరవం.. యూఏఈ నుండి గోల్డెన్ వీసా..

Upasana Konidela: ఇది ప్రపంచవ్యాప్తంగా కేవలం కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే లభించిన అరుదైన గుర్తింపు.

Upasana Konidela: మెగా కోడలుకు అరుదైన గౌరవం.. యూఏఈ నుండి గోల్డెన్ వీసా..
X

Upasana Konedela: చిరంజీవి కోడలు ఉపాసన కామినేనికి మరో అరుదైన గౌరవం లభించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, అపోలో ఫౌండేషన్ వైస్-ఛైర్‌పర్సన్ అయిన ఉపాసనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం నుండి గోల్డెన్ వీసా లభించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కేవలం కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే లభించిన అరుదైన గుర్తింపు. ఆమె ఇప్పుడు UAE పౌరురాలిగా అక్కడి ప్రభుత్వం కల్పించే అన్ని ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. "ఈ క్రిస్మస్ సందర్భంగా, నేను అసాధారణమైన బహుమతిని అందుకున్నాను" అని ఆమె వ్యాఖ్యానించింది.

ఏంటీ గోల్డెన్ వీసా ప్రత్యేకత..

2019లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దీర్ఘకాలిక నివాస వీసాల కోసం కొత్త వ్యవస్థను అమలు చేసింది. తద్వారా విదేశీయులు ఎటువంటి ఆంక్షలు లేకుండా UAEలో నివసించడానికి, పని చేయడానికి మరియు చదువుకోవడానికి వీలు కల్పిస్తుంది.

గోల్డెన్ వీసా పొందిన వ్యక్తులు దీర్ఘకాలిక రెసిడెన్సీని (5 మరియు 10 సంవత్సరాలు) అందిస్తుంది. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, పరిశోధకులు, వైద్య నిపుణులు మరియు శాస్త్ర మరియు విజ్ఞాన రంగాలలో ఉన్నవారు మరియు విశేషమైన ప్రతిభ కలిగిన వ్యక్తులు, విద్యార్థులు ఈ గోల్డెన్ వీసాకు అర్హులు.

Next Story

RELATED STORIES