తన ముద్దుల తనయ కోసం ఉపాసన స్పెషల్ గా..

తన ముద్దుల తనయ కోసం ఉపాసన స్పెషల్ గా..
పదేళ్ల నిరీక్షణ తరువాత ఓ పసిపాప తన ఒడిలో ఆడుకుంటోంది.. ఆ అపురూప క్షణాలను ఆస్వాదిస్తున్నారు రాంచరణ్, ఉపాసన దంపతులు.

పదేళ్ల నిరీక్షణ తరువాత ఓ పసిపాప తన ఒడిలో ఆడుకుంటోంది.. ఆ అపురూప క్షణాలను ఆస్వాదిస్తున్నారు రాంచరణ్, ఉపాసన దంపతులు. అపోలో హాస్పిటల్ చైర్మన్ మనవరాలైనా అణువంతైనా గర్వంలేని ఉపాసన దొరకడం నిజంగా రాంచరణ్ అదృష్టం. జీవితంలో ఏది చేయడానికైనా ముందుగా ఓ ప్లాన్ ఉండాలని వీరిని చూస్తే అర్థమవుతుంది.

పెళ్లైన పదేళ్ల తరువాత పండంటి పాపాయికి జన్మనిచ్చిన ఉపాసన భర్తపై అంతే ప్రేమను కనబరుస్తుంది. వీరి ముద్దుల తనయ క్లీంకార ఓ మంచి వాతావరణంలో పెరగాలని చిన్నారి కోసం ప్రముఖ ఆర్కిటెక్ట్ పవిత్రా రాజారామ్ నేతృత్వంలో కామినేని నివాసంలో స్పెషల్ గా ఓ రూమ్ ను డిజైన్ చేయించారు. అమ్రాబాద్ ఫారెస్ట్, వేదిక్ హీలింగ్ అంశాలను స్ఫూర్తిగా తీసుకుని ఇంటీరియర్ ను సిద్ధం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అపోలో ఆస్పత్రిలోని ఉపాసన డెలివరీ రూమ్ ని సైతం ఈ వీడియోలో చూపించారు.


Tags

Read MoreRead Less
Next Story