సినిమా

OTT, Theatres: క్రిస్మస్‌కి ఓటీటీ, థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాలు..

OTT, Theatres: రెండు బ్లాక్ బస్టర్ హిట్లతో మంచి ముగింపుని ఇచ్చింది ఈ ఏడాది ఇండస్ట్రీకి. ఈ ఉత్సాహంతో ఈ నెలలో మరికొన్ని సినిమాలు థియేటర్లలో, ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.

OTT, Theatres: క్రిస్మస్‌కి ఓటీటీ, థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాలు..
X

OTT, Theatres: రెండు బ్లాక్ బస్టర్ హిట్లతో మంచి ముగింపుని ఇచ్చింది ఈ ఏడాది ఇండస్ట్రీకి. ఈ ఉత్సాహంతో ఈ నెలలో మరికొన్ని సినిమాలు థియేటర్లలో, ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.

మ్యాట్రిక్స్..

1999లో వచ్చిన మ్యాట్రిక్స్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. దాదాపు 13 ఏళ్ల తరువాత దానికి కొనసాగింపుగా ది మ్యాట్రిక్స్ రీసర్కషన్స్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కీనూ రీన్స్, క్యారీ అన్నె మోస్‌లతో పాటు, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు.

శ్యామ్‌సింగరాయ్..

నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతిశెట్టి నటించిన శ్యామ్‌సింగరాయ్ డిసెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయి. కోల్‌కతా నేపథ్యంలో కథ సాగుతుందని తెలుస్తోంది.

83..

బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నటించిన చిత్రం 83. భారతీయ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ టోర్నమెంట్ 1983 ప్రుడెన్షియల్ కప్. ప్రపంచకప్ టోర్నీలో అడుగుపెట్టిన కపిల్ సేన ఫైనల్‌లో చిరస్మరణీయ విజయం సాధించి ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసింది. ఆ మధు స్మృతులను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నమే 83. రణ్‌వీర్ కపిల్ దేవ్ పాత్రను పోషించారు. ఇంకా దీపక పదుకణె, పంకజ్ త్రిపాఠి, జీవా తదితరులు నటించారు. ఇది కూడా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గూడు పుఠాణి..

సప్తగిరి, నేహ సోలంకి జంటగా నటించిన చిత్రం గూడు పుఠాణి. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సస్పె్న్స్, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో రఘు కుంచె విలన్‌గా కనిపించనున్నారు.

బ్యాక్‌డోర్..

పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బ్యాక్‌డోర్. డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల అవుతోంది. పూర్ణ నటన ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అవుతుందని నిర్మాత బి. శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు.

ఆశ ఎన్‌కౌంటర్..

వాస్తవిక కథాంశాన్ని ప్రేరణగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. 2019 నవంబర్ 26న హైదరాబాద్ నగర శివారులోని చటాన్ పల్లి వద్ద ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం అతి క్రూరంగా హత్య చేశారు. ఈ అంశాన్ని తీసుకుని ఆనంద్ చంద్ర చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్జీవీ సమర్పణలో అనురాగ్ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.

డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు)..

అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 24న ఓటీటీ వేదిక సోనీ లివ్‌లో విడుదల కానుంది. తొలిసారి తెలుగులో వస్తున్న కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీ ఇది. కె.వి.గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రవిప్రసాద్ రాజు దాట్ల నిర్మించారు.

మిన్నల్ మురళి

మలయాళ నటుడు టోవినో థామస్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రంలో డిసెంబర్ 24న నెట్‌ప్లిక్స్ వేదికగా విడుదలవుతోంది.

అతరంగీ రే..

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, కోలీవుడ్ నటుడు ధనుష్ కలిసి నటించిన చిత్రం అతరంగీ రే.. సారా అలీఖాన్ కథానాయిక. ఈ చి్తరం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 24న విడుదలవుతోంది. ఇంద్రజాలికుడిగా అక్షయ్, ప్రేమికులుగా ధనుష్, సారా కనిపించనున్నారు.

వరుడు కావలెను..

నాగశౌర్య, రీతూవర్మ నటించిన వరుడు కావలెను చిత్రం ఓటీటీ వేదికగా జీ5లో డిసెంబర్ 24నుంచి స్ట్రీమింగ్ కానుంది.

సత్యమేవ జయతే..

జాన్ అబ్రహం కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం సత్యమేవ జయతే. దీనికి కొనసాగింపుగా సత్యమేవ జయతే 2కూడా ప్రేక్షకాదరణ పొందింది. కాగా ఈ చిత్రం డిసెంబర్ 24వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

Next Story

RELATED STORIES