Varisu: అతడి నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది: శ్రీకాంత్

Varisu: అతడి నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది: శ్రీకాంత్
Varisu: తమిళ నటుడు తలపతి విజయ్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటించిన చిత్రం వరిసు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Varisu: తమిళ నటుడు తలపతి విజయ్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటించిన చిత్రం వరిసు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిని తెలుగులో వారసుడుగా విడుదల చేస్తోంది దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్. కొద్దిరోజుల క్రితం విడుదలైన రంజితమే ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అయింది. బుట్ట బొమ్మ ఫేమ్ థమన్ ఎస్ ఈ పాటకు స్వరాలు సమకూర్చగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు, ఇక ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మానసి పాడారు.


ఈ చిత్రాన్ని సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ చెన్నైలో గ్రాండ్‌గా నిర్వహించింది. తెలుగు సీనియర్ స్టార్ శ్రీకాంత్ వారిసు చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. శ్రీకాంత్ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో పాల్గొని తమిళ స్టార్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తలపతి విజయ్ నిజ జీవితంలో సూపర్ స్టార్ అని, అలాంటి హీరోని తన జీవితంలో చూడలేదని శ్రీకాంత్ అన్నారు.


తెలుగు చిత్ర పరిశ్రమలో తాను 125 సినిమాలు చేసినా, ఆ స్టార్ నటుడి నుండి నేర్చుకోవలసింది చాలా ఉందని విజయ్‌ని ఉద్దేశించి అన్నారు. వారిసులో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శరత్‌కుమార్, ప్రభు, సంగీత తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story