Veera Simhareddy: వీరసింహారెడ్డి.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సుగుణ సుందరి

Veera Simhareddy: వీరసింహారెడ్డి.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సుగుణ సుందరి
Veera Simhareddy: నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన మాస్ మసాలా యాక్షన్ మూవీ వీరసింహారెడ్డి.

Veera Simha Reddy: నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన మాస్ మసాలా యాక్షన్ మూవీ వీరసింహారెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకుడు. అఖండ తర్వాత ఈ సినిమాకు తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న వీర సింహారెడ్డికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్‌లో భాగంగా ఈ మూవీ నుండి ఓ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. సుగుణ సుందరి అంటూ సాగే ఈ పాటలో బాలయ్య దుమ్ములేపేశాడు. మరి ఈ సాంగ్ ఎలా ఉందో చూద్దాం.


నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. యంగ్ హీరోలు కూడా అసూయ పడేలా అదిరిపోయే బ్లాక్ బస్టర్స్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంటాడు బాలయ్య. లాస్ట్ ఇయర్ అఖండ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న బాలయ్య ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గోపీచంద మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సుగుణ సుందరి అనే సాంగ్ ను విడుదల చేశారు.



తమన్ మాస్ బీట్స్ కు బాలయ్య ఊరమాస్ స్టెప్పులతో ఈ సాంగ్ ఓ రేంజ్ లో కనిపిస్తోంది. బాలయ్య సరసన శ్రుతి హాసన్ మరింత గ్లామర్ కనిపిస్తోంది. అయితే ఈ వయసులో కూడా యంగ్ స్టర్స్ కు ఏ మాత్రం తగ్గకుండా క్లాసీ స్టెప్పులతో జోష్ గా కనిపిస్తున్నాడు బాలయ్య. బాలయ్య, శృతి హాసన్ మధ్య కెమిస్ట్రీ మాస్, క్లాస్ అదుర్స్ అనే విధంగా కనిపించింది. ఫారెన్ లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ పాటలో బాలయ్య అదరహో అనిపించేలా ఉన్నాడు.

ఇప్పటికే బాలయ్య ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూసిన ఈ పాట విడుదలైన కొన్ని క్షణాల్లోనే.. సోషల్ మీడియాను షేక్ చేసి పడిసేసింది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. రామ్ మిరియాల, స్నిగ్ధ శర్మ సాంగ్ పాడారు. ఇక శేఖర్ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన వీర సింహారెడ్డి.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది. కొంత గ్యాప్ తర్వాత ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న బాలయ్య ఈ ఒక్క సాంగ్ తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చెయ్యడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ మూవీ సంక్రాంతి బరిలో ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

బాబూరావు. కె

Tags

Read MoreRead Less
Next Story