Venkatesh 75th Movie: వెంకి 75వ సినిమా.. ఎవరా హిట్ దర్శకుడు

Venkatesh 75th Movie: వెంకి 75వ సినిమా.. ఎవరా హిట్ దర్శకుడు
Venkatesh 75th Movie: సీనియర్ హీరోలకు.. హీరోయిన్లే కాదు కథలు దొరకడమూ కాస్త కష్టమే. ఇంక స్పెషల్ స్టోరీస్ కావాలంటే మాత్రం కాస్త టైమ్ తీసుకుని అయినా సరైన కథ పడే వరకూ వెయిట్ చేయాల్సిందే.

Venkatesh 75th Cinema: సీనియర్ హీరోలకు.. హీరోయిన్లే కాదు కథలు దొరకడమూ కాస్త కష్టమే. ఇంక స్పెషల్ స్టోరీస్ కావాలంటే మాత్రం కాస్త టైమ్ తీసుకుని అయినా సరైన కథ పడే వరకూ వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు విక్టరీ వెంకటేష్‌ కూడా ఇదే సిట్యుయేషన్ లో ఉన్నాడు. కెరీర్ లో ఓ కొత్త మైల్ స్టోన్ కు చేరుకున్నాడు వెంకీ.



ఈ మైల్ స్టోన్ ను మెమరబుల్ గా మార్చుకోవాలంటే ఓ బ్లాక్ బస్టర్ కావాలి. దానికి ఓబలమైన కథ కావాలి. అందుకోసమే సెర్చింగ్ మొదలుపెట్టాడు. సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకూ ఎవరు కథ చెబుతానన్నా ఎస్ చెప్పడం.. వినడం.. వెయిటింగ్ లో పెట్టేయడం.. రొటీన్ గా జరుగుతోంది. అయితే లేటెస్ట్‌గా మరో హిట్ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చిందంటున్నారు. మరి వెంకీ కథల సంగతి ఏంటో తెలుసుకుందాం..


తెలుగులో నలుగురు హీరోల్లో ఒకడుగా ఉన్నా.. ఆ నలుగురి ఇమేజ్ నూ సొంతం చేసుకున్న స్టార్ వెంకటేష్‌. ఎన్నో డిఫరెంట్ స్టోరీస్ తో మెప్పించాడు. అలాగే రీమేక్స్ లోనూ అతనే నెంబర్ వన్ అనిపించాడు. బెస్ట్ స్టోరీస్ తో బెస్ట్ యాక్టర్ గా తన తరం హీరోలందరికంటే ఎక్కువ అవార్డ్స్ అందుకున్నాడు. క్లాస్ అండ్ మాస్ ను మెప్పించడం వెంకటేష్‌ కు మాత్రమే సాధ్యమైన ఫీట్. కొన్నాళ్ల క్రితం వరుస ఫ్లాపులతో కెరీర్ షాడో అయిపోతుంది అనుకున్న టైమ్ లో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు.



బాబు బంగారంతో హిట్ ట్రాక్ ఎక్కి దృశ్యంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వెంకీ మామ, నారప్ప అని ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేస్తున్న వెంకటేష్‌ .. కెరీర్ లో 75వ సినిమా అనే మైల్ స్టోన్ కు చేరుకున్నాడు. మరి ఈ డైమండ్ జూబ్లీ మూవీని బ్లాక్ బస్టర్ చేసుకోవాలని ఉంటుంది కదా.. అందుకే మంచి కథల కోసం చూస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం తరుణ్ భాస్కర్ పేరు బాగా వినిపించింది. మరి ఏమైందో అతను వేర కథ మొదలుపెట్టాడు.


జాతిరత్నాలుతో ఫేమ్ అయిన అనుదీప్ పేరు కూడా ఓ దశలో వినిపించింది. ప్రిన్స్ పోయిన తర్వాత అతన్ని కూడా సైడ్ చేశారు. ఇక ఇప్పుడు హిట్ మీద హిట్ కొట్టిన దర్శకుడు శైలేష్‌ కొలను పేరు వినిపిస్తోంది. హిట్, హిట్2 చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న దర్శకుడు శైలేష్. రెండూ ఒకే తరహా కథలైనా.. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో మెప్పించి.. తనదైన హిట్ వర్స్ క్రియేట్ చేసుకుంటున్నాడు. రీసెంట్ గా హిట్2ను అడవి శేష్ తో చేసి హిట్ అందుకున్నాడు.



అలాంటి దర్శకుడితో వెంకటేష్ 75వ సినిమా ఉండబోతోందనే వార్తలు టాలీవుడ్ లో హల్చల్ చేస్తున్నాయి. ఇది కమల్ హాసన్ విక్రమ్ తరహాలోనూ.. హిట్ మూవీ సీక్వెన్స్ లాగానూ కనిపించే స్టైలిష్‌ యాక్షన్ ఎంటర్టైనర్ లా ఉంటుందంటున్నారు. అయితే దగ్గుబాటి క్యాంప్ లో కథ ఓకే కావడం అంత సులువు కాదు అంటారు. మరి నిజంగా ఈ కథ ఓకే అయితే ఇక వెంకీ డైమండ్ జూబ్లీ మూవీ స్టార్ట్ అయినట్టే.

Tags

Read MoreRead Less
Next Story