Vidyu Raman: ఏంటా మాటలు.. ఎదగరా మీరు..: విద్యుల్లేఖ ఫైర్

Vidyu Raman: ఏంటా మాటలు.. ఎదగరా మీరు..: విద్యుల్లేఖ ఫైర్
Vidyu Raman: హాయిగా మాల్దీవుల్లో భర్త సంజయ్‌తో ఎంజాయ్ చేస్తున్న ఆమెకు సడెన్‌గా కోపం వచ్చింది.

Vidyu Raman: అవడానికి తమిళ యాక్టర్ అయినా తెలుగు వారు కూడా ఆమెని ఓన్ చేసుకున్నారు. ఆమె హావభావాలు, కామెడీ టైమింగ్ అన్నీ విద్యుని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసాయి. ముద్దుగా బొద్దుగా ఉండే ఆమె పట్టుదలగా వెయిట్ తగ్గి స్లిమ్‌ అయింది. ప్రేమించిన వాడిని పెళ్లాడి హనీమూన్‌కి వెళ్లింది. హాయిగా మాల్దీవుల్లో భర్త సంజయ్‌తో ఎంజాయ్ చేస్తున్న ఆమెకు సడెన్‌గా కోపం వచ్చింది.

భర్త వదిలెయ్ అని వారించినా ఊరుకోలేకపోయింది. హాస్య నటికి అంత కోపం ఎందుకొచ్చిందో అని ఆరా తీస్తే.. ఆమె వేసుకున్న స్విమ్ సూట్ నెటిజన్లకు నచ్చలేదు.. నా డ్రెస్ నా ఇష్టం.. అయినా మీరు మారరా.. మీ దృష్టి కోణాన్ని మార్చుకోరా అని విద్యు నెటిజన్ల మీద ఫైర్ అవుతోంది. స్విమ్ సూట్‌లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ గొడవ మొదలైంది.. మీరు విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా విద్యుకి మండింది.

నేను స్విమ్ సూట్ వేసుకున్నందుకే ఇలా అంటున్నారు కదూ.. ఆంటీ, అంకుల్స్ 1920 కాలాన్ని వదిలి.. 2021లోకి రండి.. నన్ను కామెంట్స్ చేశారని కాదు.. సమాజం ఆలోచించే తీరు మారాలి. ఒక మహిళ వస్త్రధారణే విడాకులకు కారణమైతే సంప్రదాయ దుస్తులు ధరించే మహిళలందరూ వారి వైవాహిక జీవితంలో ఆనందంగా ఉన్నారా.. జీవితానికి భద్రత, భరోసా, నీతి, నీజాయితీ కలిగిన వ్యక్తిని భర్తగా పొందడం నా అదృష్టం.

ఇలాంటి కామెంట్స్ గురించి స్పందించి మనసు పాడుచేసుకోవద్దని ఆయన చెప్పారు. అయితే అది నావల్ల కాలేదు. మీ ఆలోచనా తీరును నేను మార్చలేను. మహిళ అంటే కామవాంఛ తీర్చే సాధనంగా, అణిగి మణిగి ఉంటూ ఎలాంటి అవమాన్నైనా భరించే వ్యక్తిగా మీరు చూస్తున్నప్పుడు ఆమెలోని వ్యక్తిత్వం మీకు ఎందుకు కనిపిస్తుంది అని విద్యుల్లేఖ రామన్ ఘాటుగా స్పందించారు.

మీ ఆనందం కోసం ఏమైనా చేయండి.. కానీ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కామ్‌గా ఉండమంటే ఎలా ఉంటారు.. ఎవరికి వారికి ఓ సొంత అభిప్రాయం ఉంటుంది కదా.. అదే వాళ్లు వ్యక్తపరుస్తున్నారు.. అంత మాత్రానికి అంత ఫైర్ అయితే ఎలా మేడమ్ అని మరికొంత మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. మొత్తానికి సిల్వర్ స్క్రీన్ మీద నవ్వులు పూయించే విద్యుల్లేఖకి కూడా కోపం వస్తుందని తెలుసుకున్నారు నెటిజన్లు.





Tags

Read MoreRead Less
Next Story