Vijay Sethupathi: విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్: కృతి శెట్టితో సినిమాలు చేయను

Vijay Sethupathi: విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్: కృతి శెట్టితో సినిమాలు చేయను
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి టాలీవుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకున్నారు.

Vijay Sethupathi: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి టాలీవుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల విడుదలైన ఉప్పెనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా శృతీహాసన్‌తో కలిసి 'లాభం' అనే సినిమాలో నటించారు. ఈ చిత్రం ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఉప్పెన మూవీ అనంతరం తమిళంలో ఓ ప్రాజెక్ట్ వచ్చిందట. అందులో తనకు జోడీగా కృతీశెట్టిని అనుకుందట చిత్ర యూనిట్. అయితే ఉప్పెన సినిమాలో కృతికి తండ్రిగా నటించి ఇందులో ఆమె పక్కన హీరోగా నటించడమేంటని ఆ ఆఫర్‌ని తిరస్కరించారట. తండ్రిగా నటించిన నేను ఆమెతో రొమాన్స్ చేయడం సాధ్యం కాదని చెప్పాను. యూనిట్ సభ్యులకు ఉప్పెన సినిమాలో కృతికి తండ్రిగా నటించిన విషయం తెలియదు. అందుకే అలా అడిగారు. కానీ నేను చేయనని చెప్పేశాను. భవిష్యత్తులోనూ కృతి శెట్టితో సినిమా చేయను.

ఉప్పెన క్లైమాక్స్ సీన్ చేస్తున్నప్పుటు ఆమె కొంచెం కంగారు పడింది. దీంతో నాకు నీ వయసున్న కొడుకున్నాడు.. నువ్వు కూడా నాకు కూతురులాంటిదానివి. ధైర్యంగా చేయి అని చెప్పాను అని అన్నారు. కాబట్టి కూతురిలా భావించిన కృతిశెట్టితో జోటీ కట్టమంటే నా వల్ల కాదని చెప్పాను అని విజయ్ సేతుపతి పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story