ఆదిపురుష్ పై ఆగని కామెంట్లు..

ఆదిపురుష్ పై ఆగని కామెంట్లు..
విందు దారా సింగ్ హనుమంతుని వారసత్వాన్ని నాశనం చేసినందుకు ఆదిపురుష్‌ను నిందించాడు.

విందు దారా సింగ్ హనుమంతుని వారసత్వాన్ని నాశనం చేసినందుకు ఆదిపురుష్‌ను నిందించాడు. రామాయణంలో అతని తండ్రి దారా సింగ్ హనుమంతుని పాత్ర పోషించి ఆ పాత్రకు పరిపూర్ణం చేశారు. ఆదిపురుష్ సినిమాలో హనుమంతుని పాత్రను విమర్శలపాలు చేశారు. ఆ మాట కొస్తే ప్రతి పాత్ర ప్రాణం పెట్టి చేయలేదని అర్థమవుతుంది. అసలు ఈ సినిమాను ఓం రౌత్ మతి ఉండే తీశాడా అని అనుమానం వస్తుంది అని చిత్రంపై విమర్శలు గుప్పించాడు విందు.

ఆదిపురుష్ విడుదలై రోజులు గడుస్తున్నా ఆ సినిమాపై విమర్శల పర్వం ఆగలేదు. ఓ మంచి పౌరాణిక చిత్రాన్ని ఆ విధంగానా తీసేది అని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ విమర్శించారు. ఇక ప్రేక్షకుల నుంచి వచ్చిన వ్యతిరేకత సరేసరి. 1980 లలో వచ్చిన టీవీ సీరియల్ ధారావాహిక రామాయణంను రామానంద్ సాగర్ అద్భుతంగా తెరకెక్కించారు.

హనుమంతుడు ఎల్లప్పుడూ "శక్తివంతంగా ఉంటూనే నవ్వుతూ" ఉంటాడు. హనుమంతుని పాత్రలో నటించిన దేవదత్తా నాగే సరైన హిందీ కూడా మాట్లాడలేదని విందు విమర్శించాడు. టీవీ సిరీస్ రామాయణం ద్వారా మిగిలిపోయిన వారసత్వాన్ని కొత్త చిత్రం నాశనం చేసిందని విందు తెలిపారు.కొత్త చిత్రం కథ నమ్మశక్యంగా లేదని, వాస్తవాలను వక్రీకరించారని పేర్కొన్నారు. థోర్ వంటి మార్వెల్ సినిమాలను చూసే యువ తరానికి ఈ చిత్రం నచ్చుతుందని భావించిన ఆదిపురుష్ నిర్మాతలకు వందనాలు అని విందు తెలిపారు. విందు కూడా తన తండ్రిలాగే నాటకాలు, సినిమాలలో హనుమంతుడిగా నటించర్ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story