Vishal Laththi: అయ్యో విశాల్.. సినిమా రిలీజ్‌కు ముందు ఈ కామెంట్స్ ఏంటి!!

Vishal Laththi: అయ్యో విశాల్.. సినిమా రిలీజ్‌కు ముందు ఈ కామెంట్స్ ఏంటి!!
Vishal Laththi: మాస్ హీరోగా తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న స్టార్ విశాల్. తన పర్సనాలిటీకి తగ్గట్టుగా అన్నీ మాస్ మూవీస్ మాత్రమే చేసే విశాల్ వ్యక్తిత్వంలోనూ ఆకట్టుకుంటాడు.

Vishal Laththi: మాస్ హీరోగా తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న స్టార్ విశాల్. తన పర్సనాలిటీకి తగ్గట్టుగా అన్నీ మాస్ మూవీస్ మాత్రమే చేసే విశాల్ వ్యక్తిత్వంలోనూ ఆకట్టుకుంటాడు. ఇష్యూ ఏదైనా వెంటనే రియాక్ట్ అవుతాడు. జనం కోసం నిలబడేందుకు ప్రయత్నిస్తాడు.



అయితే కొన్నిసార్లు ఒన్ సైడెడ్ గా ఆలోచిస్తాడు. రాజకీయాల్లో లేను అంటూనే మాట్లాడతాడు. ఇలాంటివి ఎప్పుడైనా అయితే ఫర్వాలేదు కానీ.. సినిమాల రిలీజ్ ల ముందు చేస్తే ఖచ్చితంగా మైనస్ అవుతుంది. అతను నటించిన లాఠీ ఈ గురువారం వస్తోంది. ఈ టైమ్ లో ఐ లవ్ జగన్ అంటూ అతను చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌లో చర్చకు దారి తీసింది.


విశాల్ మంచి నటుడా కాదా అనేది పక్కన బెడితే.. మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఓ దశలో వరుస కమర్షియల్ సక్సెస్ లతో దూసుకుపోయాడు. తనే సొతంగా బ్యానర్ పెట్టి చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు కూడా. అయితే కొన్నాళ్లుగా అతని సినిమాలు అనుకున్నంత సక్సెస్ కావడం లేదు. ముఖ్యంగా తెలుగులో హిట్ చూసి చాలాకాలం అయింది.



రియలిస్టిక్ యాక్షన్ స్టంట్స్ చేయడంలో ఎక్స్ పర్ట్ అయినా.. కేవలం స్టంట్స్ మాత్రమే ఆడియన్స్‌ని థియేటర్‌కు రప్పించవు అన్న విషయం గ్రహించలేకపోతున్నాడు. అందుకే ఫ్లాపులు పడుతున్నాయి. అయినా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో అతను నటించిన కొత్త సినిమా లాఠీ. ఓ సాధారణ కానిస్టేబుల్ లైఫ్ స్టోరీతో వస్తోన్న చిత్రం ఇది.


ఏ వినోద్ కుమార్ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రంలో సునయన హీరోయిన్. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ చూస్తే తెరంతా రక్తపాతమే అన్నట్టుగా కనిపించింది. సరే విశాల్ ఇమేజ్ కోసమే ఇది అనుకోవచ్చు. అయితే అతను లాఠీ రిలీజ్ కుముందు చేసిన పొలిటికల్ కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారాయి.



తనకు కుప్పం మొత్తం తెలుసని.. అక్కడి కాంట్రాక్టర్ల నుంచి కూలీలందరితో పరిచయం ఉందన్నాడు. అదే టైమ్ లో అక్కడి నుంచి పోటీ చేయను అని చెబుతున్నాడు. ఇక జగన్ అంటే తనకు ఇష్టమనీ.. ఐ లవ్ జగన్ అనీ అంటున్నాడు. కొన్నాళ్ల క్రితం కూడా విశాల్ కుప్పం నుంచి పోటీ చేస్తాడు అనే రూమర్స్ వచ్చాయి.



నిప్పులేకుండా పొగరాదు కదా..? అయితే రిలీజ్ కు ముందు ఇలా ఒక నాయకుడు తనకు ఇష్టం అని చెప్పడం అపొజిషన్ నాయకుడికి మింగుడు పడని విషయం. అందుకే విశాల్ సినిమాను చూడం అంటున్నారు చాలామంది. ఏదేమైనా అందరూ రాజకీయ నాయకులే అని చెబుతోన్న విశాల్.. దాన్ని ప్రదర్శించడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు.

Tags

Read MoreRead Less
Next Story