Shiva Raj Kumar: నటీనటులంతా ఒకే కుటుంబం.. మరి మీకెందుకు ద్వేషం: శివరాజ్ కుమార్

Shiva Raj Kumar: నటీనటులంతా ఒకే కుటుంబం.. మరి మీకెందుకు ద్వేషం: శివరాజ్ కుమార్
Shiva Raj Kumar: శాండిల్‌వుడ్‌ హీరో పై జరిగిన దాడిని ఖండించింది కన్నడ చిత్ర పరిశ్రమ. దర్శన్ పై జరిగిన దాడిపై దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ సోదరుడు నటుడు శివరాజ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shiva Raj Kumar: శాండిల్‌వుడ్‌ హీరో పై జరిగిన దాడిని ఖండించింది కన్నడ చిత్ర పరిశ్రమ. దర్శన్ పై జరిగిన దాడిపై దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ సోదరుడు నటుడు శివరాజ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి తనను కలచి వేసిందని.. తామంతా ఒక కుటుంబసభ్యులమేనని అన్నారు. ఇలాంటి అమానవీయ ఘటన మా కుటుంబానికి చెందిన వారందరినీ బాధిస్తుంది. దయచేసి ఎవరూ మానవత్వాన్ని మరచి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని మనవి చేస్తున్నాను. అభిమానంతో ప్రేమను పంచండి. ద్వేషం, అగౌరవం కాదు అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు శివరాజ్ కుమార్.


ఇక దర్శన్ పై జరిగిన దాడిపై పుష్ప ఫేం ధనుంజయ స్పందించారు. ఈ ఘటన సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరిని దిగ్ర్భాంతికి గురి చేసిందని.. కొంతమంది వ్యక్తులు చేసే పని వల్ల కళాకారుల ఛరిష్మా దెబ్బతినకూడదని, ఇలాంటి ఘటనకు పాల్పడిన వ్యక్తులకు శిక్షంచాలన్నారు. అభిమానుల మధ్య ఇలాంటి విభేదాలు ఉండకూడదని. కర్ణాటక ప్రేమ, కరుణకు పుట్టినిల్లు అన్నారు.


తన అప్‌ కమింగ్‌ మూవీ క్రాంతి ప్రమోషన్‌లో ఉన్న కన్నడ హీరో దర్శన్‌పై హోస్పేటలో ఓ వ్యక్తి చెప్పువిసిరాడు. సడెన్‌ గా జరిగిన ఆ ఘటనతో అక్కడున్నవారంత షాకయ్యారు. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోగా.. అతడిని ఏమి చేయవద్దన్నారు దర్శన్. అంతకుముందు పునీత్, దర్శన్ అభిమానుల మధ్య వివాదం చోటు చేసుకుంది. గతంలో పునీత్ గురించి దర్శన్ చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది..

Tags

Read MoreRead Less
Next Story