The Kashmir Files: వాటే క్రేజీ.. సినిమా టిక్కెట్ చూపిస్తే 30% డిస్కౌంట్

The Kashmir Files: వాటే క్రేజీ.. సినిమా టిక్కెట్ చూపిస్తే 30% డిస్కౌంట్
The Kashmir Files: ది కాశ్మీర్ ఫైల్స్ మూవీకి టిక్కెట్‌లను చూపిస్తే వినియోగదారులకు వారు కోరుకున్న వస్తువులపై డిస్కౌంట్ ఇస్తున్నారు.

The Kashmir Files: కాశ్మీరీ పండిట్ల యదార్థగాధను తెరకెక్కించిన చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్.. ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన తొలిరోజు నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. చిత్రంలో చూపించిన కశ్మీరీ హిందువులపై జరిగిన అఘాయిత్యాల యదార్థ గాథ ప్రజల హృదయాలను కలవరపరిచింది.

సినిమా చూసి కొంత మంది ఎమోషనల్ అయితే, చాలా మంది షాక్ అయ్యారు. అద్భుతంగా తెరకెక్కించారని అందరూ మెచ్చుకుంటున్నారు. దేశ ప్రధాని మొదలుకుని పలువురు పెద్దల వరకు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలని అన్నారు.

మరి కొంతమంది సాధారణ పౌరులు కూడా ఈ చిత్రాన్ని చూడమని ఇతరులను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో చాలా మంది దుకాణదారులు ఈ చిత్రాన్ని చూడమంటూ అనేక ఆఫర్‌లు ఇస్తున్నారు.

రూరా ప్రాంతంలో, బైక్ షోరూమ్ నిర్వాహకులతో పాటు కొంతమంది టెక్స్‌టైల్, హార్డ్‌వేర్ దుకాణదారులు ది కాశ్మీర్ ఫైల్స్ మూవీకి టిక్కెట్‌లను చూపిస్తే వినియోగదారులకు వారు కోరుకున్న వస్తువులపై డిస్కౌంట్ ఇస్తున్నారు. వ్యాపారులు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

జిల్లాలోని కొందరు బట్టల దుకాణదారులు సినిమా టిక్కెట్ల కొనుగోలుపై 30 శాతం వరకు రాయితీ ఇచ్చారు. అదే సమయంలో, ఆ ప్రాంతానికి చెందిన బైక్ షోరూమ్ నిర్వాహకుడు కృష్ణ కుమార్ ఐదు శాతం తగ్గింపును ప్రకటించారు. కశ్మీర్‌ పండిట్ల గురించి నిజం తెలియని యువ తరం తప్పకుండా ఈ సినిమా చూడాలని అంటున్నారు. సినిమా టిక్కెట్లపై ఈ తగ్గింపు గురించి తెలుసుకున్న ప్రజలు దానిని సద్వినియోగం చేసుకోవడానికి దుకాణాల ముందు క్యూ కడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story