Aghora: అఖండలో అఘోరగా బాలయ్య...! అసలు ఎవరీ అఘోరాలు .. వాళ్ళ జీవన విధానం ఏంటి?

Aghora:  అఖండలో అఘోరగా బాలయ్య...! అసలు ఎవరీ అఘోరాలు .. వాళ్ళ జీవన విధానం ఏంటి?
Aghora: కుంభమేళాలో మాత్రమే కనిపించే అఘోరాల ఆహార్యం భయం గొలిపేదిగా ఉంటుంది. శివ సాన్నిధ్యం చేరుకునేందుకే అఘోరాలుగా అవతరిస్తామని చెప్పుకుంటారు.

Aghora: అఖండ సినిమాలో హీరో బాలకృష్ణ అఘోర పాత్ర పోషించారు. దీనితో అసలు అఘోరాలు అంటే ఎవరు? ఏం చేస్తారు? ఎలా జీవిస్తారు? అనే చాలా మంది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ అఘోరాల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే... అఘోరాలు స్మశానాల్లో నిద్రిస్తారు.. శవాలతో సంభోగిస్తారు.. అఘోరాలు మానవ మలం నుండి మూత్రం వరకు అన్నీ స్వీకరిస్తారు. పగటిపూట నిద్రిస్తారు.. రాత్రిపూట సాధన చేస్తారు. ప్రతి రోజు సిద్ధ మంత్రాన్ని విధిగా జపిస్తారు. మెడలో మానవ పుర్రెలు ధరించి, ఒంటినిండా బూడిదతో నగ్నంగా సంచరిస్తారు.. కుంభమేళాలో మాత్రమే కనిపించే అఘోరాల ఆహార్యం భయం గొలిపేదిగా ఉంటుంది. శివ సాన్నిధ్యం చేరుకునేందుకే అఘోరాలుగా అవతరిస్తామని చెప్పుకుంటారు.

అఘోరాల జాతి 17వ శతాబ్దం నుంచి ఉన్నట్టు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. బాబా కినారమ్‌ను అఘోరాలు గురువుగా భావిస్తారు. ఆయన 200 ఏళ్లకు పైగా బతికినట్టు అఘోరాలు చెబుతుంటారు. అఘోరాల జీవన శైలి సామాన్యులకు అంతుపట్టని రీతిలో ఉంటుంది.

హిమాలయ సానువుల్లో సంచరించే అఘోరాలు కైలాస్, మానస సరోవర్, గంగ, యమున, సరస్వతి, కేదార్‌నాథ్‌, హరిద్వార్‌, రుషికేష్‌, బద్రీనాథ్‌.. వంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో సంచరిస్తుంటారు. బయటి ప్రపంచం వీరికి పట్టదు. తమని తామూ పట్టించుకోరు.. శరీరంపై మమకారం పెంచుకోరు. కోరికలు లేని జీవన విధానం అనుసరిస్తారు. ఉపాసనలోనే జీవితం గడుపుతారు.


కాష్టంలోని కట్టెలతో కపాలీ పూజ నిర్వహిస్తారు. అందులోని ఆధ్యాత్మిక అనుభూతిని ఆస్వాదిస్తారు. ఎవరినీ తమ దగ్గరకు రానివ్వరు. అక్కడే ఈశ్వర ఆరాధనలో ఉంటారు.. ఎక్కడైనా కుంభమేళాలు జరిగినప్పుడు మాత్రం కనిపిస్తారు.. నదుల్లో పుణ్యస్నానమాచరించి తిరిగి వెళ్లిపోతారు.

సృష్టికర్తపై అమితమైన విశ్వాసం కలిగి ఉంటారు.. ఈ లోకాన్ని సృష్టించింది.. నడిపిస్తున్నది.. నాశనం చేస్తున్నది ఈశ్వరుడేనని బలంగా నమ్ముతారు. శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని వారి నమ్మకం. దేవుడు తప్ప మిగతా లోకమంతా మిథ్య అని వారు భావిస్తారు.. తాము భగవంతుడితో సన్నిహితంగా ఉంటున్నట్లు అనుభూతి చెందుతారు.

అఘోరాలు చేసే సాధనలలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి- శివ సాధన, శవ సాధన, శ్మశాన సాధన. ఈ సాధనల్లో మృతదేహంపై నిలబడి పూజలు చేస్తారు.. వాటికి గంగాజలం, ప్రసాదం (మాంసం లేదా మద్యం) సమర్పిస్తారు.

అఘోరాలు ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు..

''ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు, పరమాత్మతో ఏకం కావడానికి వీరు పవిత్ర నియమాలను ఆచరిస్తారు'' అని లండన్‌లోని 'స్కూల్ ఆప్ ఆఫ్రికన్, ఓరియెంటల్ స్టడీస్' సంస్కృత బోధకుడు జేమ్స్ మాలిన్సన్ చెప్పుకొచ్చారు. ఆధ్యాత్మిక గురువుగా శిష్యులకు ఉపదేశాలిచ్చే మాలిన్సన్ అనేకసార్లు అఘోరాలను కలుసుకున్నారు. శవాలను తినడం వంటి ప్రమాదకర పద్ధతులు పాటిస్తుంటారు. ఈ చర్యల ద్వారా వారు అత్యున్నత చేతనాస్థితిని పొందుతున్నట్లు భావిస్తారని మాలిన్సన్ అంటారు.

అఘోరాలు అందరి మంచి కోసం పూజలు చేస్తారు. ఉత్తర భారతదేశంలో అఘోరాల్లో పురుషులే ఉంటారు. కానీ, పశ్చిమబెంగాల్‌లో మాత్రం శ్మశాన వాటికల్లో పురుషులతో పాటు మహిళా అఘోరాలు కూడా కనిపిస్తారు. ఈ మహిళా అఘోరాలు దుస్తులు ధరిస్తారు. చాలా మందికి చావంటే భయం. స్మశానం పేరు చెబితే వణుకు. కానీ అఘోరాలు మాత్రం స్మశానంలోనే కాలం గడుపుతారు. అదే వారి నివాస స్థలం.

ఇటీవలి కాలంలో అఘోరాల ఆహార్యంలో మార్పు వస్తోంది.. బయటి ప్రపంచంలోకి వచ్చినప్పుడు చిన్నపాటి వస్త్రాలు ధరిస్తున్నారు.. ప్రజా రవాణా ఉపయోగిస్తున్నారు. సెల్‌ఫోన్లు వారి జీవితంలో భాగమవుతున్నాయి.

దేశంలో ఎంత మంది అఘోరాలు ఉన్నారని లెక్కల్లో స్పష్టత లేనప్పటికీ.. వేల సంఖ్యలో ఉన్నారని మాత్రం అంచనా. తాము మృతదేహాలతో సంభోగిస్తామని బహిరంగంగా అంగీకరించిన అఘోరాలు తాము జరిపే కర్మకాండల్లో భాగంగా వేశ్యలతోనూ సంభోగిస్తారట. కానీ అఘోరాల్లో ఏ ఒక్కరూ స్వలింగ సంపర్కాన్ని ఆమోదించరు అని చెప్పారు మాలిన్సన్.

Tags

Read MoreRead Less
Next Story