ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదంటే..: రాజీవ్ కనకాల

ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదంటే..: రాజీవ్ కనకాల
ఏపీలో పాలిటిక్స్ చూస్తుంటే ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది. ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబును అరెస్ట్ చేయడం నేతలతో పాటు, కుటుంబసభ్యులనూ ఆ విషయం కలచి వేస్తోంది.

ఏపీలో పాలిటిక్స్ ఎక్కడికో వెళుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబును అరెస్ట్ చేయడం నేతలతో పాటు, కుటుంబసభ్యులనూ ఆ విషయం కలచి వేస్తోంది. అందరూ స్పందించారు. కానీ ఎన్టీఆర్ ఎందుకు స్పందించట్లేదు.. అదే పెద్ద వార్త. దాన్ని వివరించేందుకు ఆయన ఇక్కడ లేరు. తాను చేస్తున్న దేవర ప్రాజెక్ట్ కోసం విదేశాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కి అతి సన్నిహితుడు అయిన రాజీవ్ కనకాల ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ఇందులో తారక్ ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై స్పందించకపోవడం గురించి మాట్లాడారు.

ఎన్టీఆర్‌కి నటన అంటే చాలా మక్కువ, దాని కోసమే తన సమయాన్ని వెచ్చిస్తున్నాడు. ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదేంటని నందమూరి బాలకృష్ణను ప్రశ్నించగా.. పట్టించుకోవడం లేదంటూ బదులిచ్చారు. దీనిపై తారక్ ఎందుకు స్పందించాలని ఎన్టీఆర్ సన్నిహితులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే.

అందుకు బిజీ షెడ్యూల్స్ కారణమని అంటున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత ఎన్టీఆర్‌ చాలా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం 'దేవర' భారీ ప్రాజెక్ట్‌ చేస్తున్నాడు. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.

రాజకీయాల్లోకి రావడం గురించి కనకాల మాట్లాడుతూ.. అందుకు తగిన సమయం ఇవ్వగలనని అనుకున్నప్పుడు వస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు చాలా పరిజ్ఞానం ఉండాలని, చాలా తెలుసుకోవాలని చెప్పారు. రాజకీయాలు పూర్తిగా మారిపోయినందున తనకు మరో రెండేళ్లు పట్టవచ్చని ఆయన అన్నారు. నేను ఈరోజు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే అది ఎంతో కాలం నిలబడదు. రాజీవ్ కనకాల ప్రకారం ఈ రోజుల్లో వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయి. ఇది చాలా తప్పని, వ్యక్తిగత దూషణలు చేయవద్దని ప్రజలను కోరారు.

Tags

Read MoreRead Less
Next Story