సినిమా

Ram Gopal Varma: పేర్ని నాని.. కేవలం వర్మతోనే మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఇదేనా..?

Ram Gopal Varma: గత వారం నుండి ట్విటర్‌లో రామ్ గోపాల్ వర్మ వర్సెస్ పేర్ని నాని వార్ నడుస్తోంది.

Ram Gopal Varma: పేర్ని నాని.. కేవలం వర్మతోనే మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఇదేనా..?
X

Ram Gopal Varma: గత వారం నుండి ట్విటర్‌లో రామ్ గోపాల్ వర్మ వర్సెస్ పేర్ని నాని వార్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల విషయంలో ఎంతోమంది టాలీవుడ్ హీరోలు స్పందించినా.. అందులో వర్మ మాత్రం కాస్త తన స్టైల్‌లో స్పందించేసరికి ఒక్కసారిగా ఆయన ట్వీట్స్ వైరల్ అయ్యాయి. దీంతో వర్మతో నేరుగా మాట్లాడడానికి కూడా పేర్ని నాని రెడీ అయిపోయారు. అందుకే జనవరి 10న మీటింగ్ ఏర్పాటు చేశారు.

ఇప్పటికీ సినిమా టికెట్ల వ్యవహారంపై పవన్ కళ్యాణ్, నాని, లాంటి హీరోలు స్పందించినా కూడా వారెవ్వరినీ మీటింగ్‌కు పిలవని వైఎస్‌ఆర్‌సీపీ వర్మను మాత్రమే ఎందుకు పిలిచింది అంటూ ఫిల్మ్ సర్కిల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాదాపు మూడు రోజులకు పైగా ఆర్జీవీ.. పేర్ని నాని కౌంటర్‌లకు రివర్స్ కౌంటర్‌లు ఇస్తూ.. ఆయన అభిప్రాయాలన్ని ఓ వీడియోలో చెప్తూ.. సోషల్ మీడియాలో హైలెట్ అయ్యారు.

అంతే కాకుండా ఇటీవల జగన్ గురించి కూడా తన ట్వీట్స్‌లో ప్రస్తావించాడు ఆర్జీవీ. జగన్ అన్నా, వైఎస్‌ఆర్సీపీ అన్నా తనకు చాలా ఇష్టం అన్న వర్మ.. పార్టీలో ఉన్న ఇతర కార్యకర్తల వల్లే జగన్ ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. అలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై వరుసగా ట్వీట్‌లు చేసిన తర్వాత వర్మకు పేర్ని నాని నుండి పిలుపు వచ్చింది.

పేర్ని నాని తనను మీటింగ్‌కు పిలిచినట్టు స్వయంగా వర్మనే తన ట్విటర్‌లో తెలిపారు. జనవరి 10న ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియెట్‌లో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రాఫీ మంత్రి పేర్ని నానిని కలుస్తున్నట్టుగా ట్వీట్ చేశారు వర్మ. కేవలం వర్మను మాత్రమే మీటింగ్‌కు పిలిచారు అంటే.. వైసీపీ వర్మతో ఎలాంటి డీలింగ్ పెట్టుకోనుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story

RELATED STORIES