Prabhas: ఆ పిల్ల బాత్రూంలో నేనెందుకుంటానురా.. ప్రభాస్ అదిరిపోయే సెటైర్..

Prabhas: ఆ పిల్ల బాత్రూంలో నేనెందుకుంటానురా.. ప్రభాస్ అదిరిపోయే సెటైర్..
Prabhas: ప్రభాస్ రొమాంటిక్ హీరో హీరోయిన్లు ఆకాశ్, కేతికా శర్మలను ఇంటర్వ్యూ చేశారు.

Prabhas:ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ నటించిన చిత్రం రొమాంటిక్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్రమోషన్‌లో భాగంగా డార్లింగ్ ప్రభాస్ రొమాంటిక్ హీరో హీరోయిన్లు ఆకాశ్, కేతికా శర్మలను సరదాగా ఇంటర్వ్యూ చేశారు.

మొదట కేతిక తనని తాను పరిచయం చేసుకుంటూ హాయ్ సార్.. నేను కేతికను.. ఢిల్లీ నుంచి వచ్చాను అని చెప్పగా.. హాయ్ మేడమ్.. మాది మొగల్తూరు.. నేను ప్రభాస్ అని చెప్పి కేతికను విష్ చేశాడు. కేతిక బాగా పాడుతుందని ఆకాశ్ అనగా.. కేతిక ఆకాష్ మాటలకు అడ్డు పడి.. అంత లేదు.. నేను బాత్‌రూమ్ సింగర్‌ని మాత్రమే అని పేర్కొంది.

దానికి ఆకాశ్.. అయితే ఇది బాత్రూం అనుకో.. నేను, ప్రభాస్ అన్న ఇక్కడ లేమనుకో.. అని పాడమని అడుగుతాడు కేతికని.. దానికి ప్రభాస్.. ఆమె బాత్రూంలో నేనెందుకు ఉంటానురా అని ప్రభాస్ అదిరిపోయే సెటైర్ వేశాడు. ఇంటర్వ్యూ మొత్తం ప్రభాస్ చాలా ఓపెన్‌గా మాట్లాడుతూ ఆద్యంతం నవ్వులు పూయించాడు.

రాథేశ్యాం, ఆదిపురుష్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆకాశ్ కోసం ప్రమోషన్స్‌లో పాల్గొనడం.. ప్రభాస్ అభిమానులకు మరింత దగ్గర చేసింది. ఇక ప్రభాస్ ఇంటర్వ్యూ చివర్లో తనకు పూరీ జగన్నాథ్ భార్య లావణ్య అంటే ఇష్టం, గౌరవం అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఇంటర్వ్యూ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story