వరల్డ్ కప్ ఫైనల్.. విజయశాంతి చెప్పిన కొత్త ఫార్ములా..

వరల్డ్ కప్ ఫైనల్.. విజయశాంతి చెప్పిన కొత్త ఫార్ములా..
ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచారు. కానీ ఆఖరి మ్యాచ్ ఓడిపోయారు.. కప్పు చేజారిపోయింది. మళ్లీ కంగారూలే కప్పుని ఎత్తుకుపోయారు.

ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచారు. కానీ ఆఖరి మ్యాచ్ ఓడిపోయారు.. కప్పు చేజారిపోయింది. మళ్లీ కంగారూలే కప్పుని ఎత్తుకుపోయారు. టీమ్ ఇండియాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యావత్ భారతావని నిరుత్సాహానికి గురైంది. ఆటగాళ్లు సైతం ఆ క్షణంలో ఉబికి వచ్చిన కన్నీరుని ఆపుకోలేకపోయారు. అయినా ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచులు గెలిచిన టీమ్ ఇండియాకు జేజేలు పలికారు క్రికెట్ ప్రియులు.

ఆటలో గెలుపోటములు సహజం అంటూ ఊరడించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీని వీడి కాంగ్రెస్ తో చేతులు కలిపిన నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి సైతం నిజానికి ఈ గెలుపు ఇండియాదే అని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు X లో పోస్ట్ పెట్టారు. వరుసగా 10 మ్యాచులు గెలిచిన ఇండియా ఒక్క ఫైనల్ మ్యాచ్ ఓడిపోయింది. ఇక ఆస్ట్రేలియా అయితే 8 మ్యాచులు మాత్రమే గెలిచింది. ఆ లెక్కన చూస్తే ఇండియానే విన్నర్. అయినా ఒక్క మ్యాచ్ తో గెలుపోటములు నిర్ణయించకూడదు.

విజయ శాంతి సూచన ప్రకారం.. ఇతర క్రీడలలో లాగానే.. క్రికెట్‌లో కూడా బెస్ట్ ఆఫ్ 3 విధానం ఉండాలి. అంటే.. ఫైనల్‌లో 3 మ్యాచ్‌లు జరగాలి. వాటిలో ఏ టీమ్ పెర్ఫార్మెన్స్ బాగుంటే.. ఆ టీమ్‌కి టైటిల్ ఇవ్వాలని సూచిస్తున్నారు. దీని వల్ల ఆయా జట్లు తమ నిజమైన ప్రతిభను చాటుకోగలవని అంటున్నారు. ఇటు ఫ్యాన్స్ కూడా నిరాశ చెందాల్సిన పని ఉండదని ఆమె సలహా ఇస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story