Adipurush: ఆదిపురుష్ ఫెయిల్యూర్ పై క్షమాపణలు

Adipurush: ఆదిపురుష్ ఫెయిల్యూర్ పై క్షమాపణలు
ఆదిపురుష్‌కి భారీ ఎదురుదెబ్బ తగిలిన తర్వాత, మనోజ్ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు.


రామాయణం ఆధారంగా ప్రభాస్, కృతి సనన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ఈ చిత్రం విడుదలైనప్పటినుంచి విమర్శలపాలైంది. కథ, వీఎఫ్ఎక్స్, పాత్రల ఆహార్యం ఇలా ప్రతీ ఒక్క కేటగిరీలో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. రాముడిగా ప్రభాస్, సీతాదేవిగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఇందులో డైలాగ్స్ పై కూడా ప్రేక్షకులు పెదవి విరిచారు. ఈ చిత్ర మాటల రచయిత మనోజ్ మున్ స్టాషిర్ సినిమాకు సపోర్ట్ గా గతంలో కామెంట్స్ చేశాడు. దీంతో ప్రజలు ఆయనపై ఫైర్ అయ్యారు.


సినిమాలో ఆయా క్యారెక్టర్లు మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉందని ప్రేక్షకులు విమర్శించారు. వీటిపై స్పందించిన మనోజ్ డైలాగ్స్ ను వెనకేసుకొచ్చాడు. దీంతో ప్రేక్షకుల ఆగ్రహం అట్టుడికిపోయింది. ఈ విషయాలపై మనోజ్ ఇప్పుడు క్షమాపణ చెప్పాడు. ఇందుకుగాను సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఆదిపురుష్ ప్రజల భావోద్వేగాలను గాయపరిచినందున తాను చింతిస్తున్నట్లు చెప్పాడు. ఇందుకుగాను చేతులుజోడించి క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపాడు. ప్రభువు బజరంగ్ బలీ మనల్ని ఐక్యంగా ఉంచాలని కోరాడు. పవిత్రమైన సనాతన ధర్మానికి, దేశానికి సేవ చేయడానికి మనకు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నాడు.


మనోజ్ క్షమాపణలపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు తప్పులు గ్రహించారని అంటుండగా, మరికొందరు సానుభూతి పొందడం కోసమే క్షమాపణలు కోరుతున్నాడని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story