సినిమా

Shreya Muralidhar: యంగ్ యూట్యూబ్ స్టార్ మృతి.. 'ప్రదీప్ పెళ్లిచూపులు' షోతో ఫేమ్..

Shreya Muralidhar: ఈమధ్య ఏ వయసు వారికైనా గుండెపోటు రావడం సహజంగా మారిపోయింది.

Shreya Muralidhar (tv5news.in)
X

Shreya Muralidhar (tv5news.in)

Shreya Muralidhar: ఈమధ్య ఏ వయసు వారికైనా గుండెపోటు రావడం సహజంగా మారిపోయింది. కాస్త ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా, ఆరోగ్యంపై సరిగా దృష్టి పెట్టకపోయినా గుండెపోటు చాలామంది ప్రాణాలనే హరించేస్తుంది. తాజాగా ఓ 27 ఏళ్ల యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇలాగే గుండెపోటుతో మరణించింది. తనే శ్రేయ మురళీధర్.

యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఇప్పటికీ ఎంతోమంది చిన్నదో, పెద్దదో సెలబ్రిటీ స్టేటస్‌ను సంపాదించుకున్నారు. అందులో శ్రేయ మురళీధర్ ఒకరు. పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్న సమయంలో ప్రదీప్ పెళ్లిచూపులు షోలో కనిపించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయింది శ్రేయ. అందులో తన క్యూట్ మాటలు చాలామందినే ఆకట్టుకున్నాయి. ఆ షో ముగిసిన తర్వాత యధావిథిగా తన యూట్యూబ్ లైఫ్‌తో బిజీ అయిపోయింది.

'వాట్ ద ఫన్' అనే యూట్యూబ్ ఛానెల్‌లో శ్రేయ మురళీధర్ రెగ్యులర్‌గా వీడియోలు చేస్తూ ఉంటుంది. అలా చాలామంది ఫ్యాన్స్‌నే సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే శ్రేయకు ఫాలోవర్స్ కూడా చాలామందే ఉన్నారు. అలాంటి శ్రేయ ఉన్నట్టుండి మరణించడం అందరినీ బాధిస్తోంది. శనివారం రాత్రి శ్రేయ ఛాతినొప్పితో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే శ్రేయ మరణించిందని అక్కడి వైద్యులు తెలిపారు. శ్రేయ మురళీధర్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లక్డీకాపూల్‌లో నివసిస్తోంది. శ్రేయ మృతి పట్ల యూట్యూబ్‌ స్టార్‌ దీప్తీ సునైనా, సినీ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రితతో పాటు పలువురు యూట్యూబ్ స్టార్లు సంతాపం తెలియజేశారు.

Next Story

RELATED STORIES