Cricket: భారత్‌ vs న్యూజిల్యాండ్‌.. భద్రత కట్టుదిట్టం

Cricket: భారత్‌ vs న్యూజిల్యాండ్‌.. భద్రత కట్టుదిట్టం
ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌; స్టేడియాన్ని చుట్టు ముట్టిన భద్రతా బలగాలు; రాత్రి 1 గం. వరకు మెట్రో సేవలు

ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో నేడు (బుధవారం) న్యూజిల్యాండ్‌తో భారత్‌ వన్డే మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు భద్రత విషయంపై పోలీసుల అన్ని విధాల ఏర్పాట్లు చేశారు. స్టేడియం చుట్టూ 2500 మంది పోలీసులతో 300 వందల సీసీ కెమెరాలను అమర్చి కట్టు దిట్టమైన నిఘాను ఏర్పాటు చేశారు.


పేలుడు పదార్థాలను గుర్తించేందుకు ప్రధాన ద్వారాల వద్ద స్కానర్లను, బాంబ్‌ డిస్పోజబుల్‌ బృందాన్ని, స్నిఫర్‌ డాగ్స్‌ను కూడా రంగంలోకి దించారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకోవడానికి ప్రత్యేక బృందాలు, 1,3,4,7,8 గేట్ల వద్ద గట్టి బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు.


మ్యాచ్‌ దృష్ట్యా మెట్రో రైల్‌ సమయాన్ని పొడగించినట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి 1 గంటల వరకు మెట్రో అందుబాటులో ఉంటుందని తెలిపారు. స్టేడియంలోపలికి ల్యాప్‌ టాప్‌లు, బ్యాన్నర్లు, వాటర్‌ బాటిల్స్‌, కెమెరాలు, సిగరెట్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, బ్యాగ్ లు కాయిన్స్‌, బైనాకులర్స్‌, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్, పర్ఫ్యూమ్స్‌ లాంటివి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. మహిళల భద్రతకోసం "షీ" టీం బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story