కుమ్మేశారంతే.. ఇంగ్లాండ్ లక్ష్యం 318..!
ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణిత 50 ఓవర్లలలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది..

X
Vamshi Krishna23 March 2021 12:24 PM GMT
ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణిత 50 ఓవర్లలలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది.. ఇన్నింగ్స్ చివర్లో .. జట్టులోకి అరంగ్రేటం చేసిన కృనాల్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. కేవలం 26 బంతుల్లోనే అర్ధం శతకాన్ని సాధించాడు. ఇందులో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా కృనాల్ పాండ్యా రికార్డు సృష్టించాడు. ఇక రోహిత్ శర్మ (28), ధావన్ (98), కోహ్లీ(56), కేఎల్ రాహుల్ (58), శ్రేయాస్ అయ్యర్ (6), పాండ్యా (1) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలలో బెన్‌స్టోక్స్ 3, మార్క్‌వుడ్ 2 వికెట్లు తీశారు.
Next Story