కాసేపట్లో భారత్-శ్రీలంక మధ్య తొలి వన్డే..!

కాసేపట్లో భారత్-శ్రీలంక మధ్య తొలి వన్డే..!
మూడు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా... భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆర్ ప్రేమదాస స్టేడియంలో తొలి వన్డే కాసేపట్లో జరగనుంది.

మూడు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా... భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆర్ ప్రేమదాస స్టేడియంలో తొలి వన్డే కాసేపట్లో జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. శ్రీలంకతో ఆరు మ్యాచ్‌లు జరగనుండగా.. అందులో మూడు వన్డే మ్యాచ్‌లు, మూడు టీ20 మ్యాచ్‌లు. ధావన్ కెప్టెన్సీలో కొత్త ఆటగాళ్లతో.. సిరీస్‌కు సిద్దమయ్యారు..

భారత జట్టులో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌తో పాటు భువనేశ్వర్, కుల్దీప్‌ యాదవ్, చహల్, హార్దిక్‌ పాండ్యా, మనీశ్‌ పాండే లకు ఇప్పటికే టీమిండియాకు ఆడిన అనుభవం ఉంది. ఇక ఐపీఎల్‌ స్టార్లు పృథ్వీషా, సంజు సామన్సన్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు సత్తా చాటాలని చూస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవాలనుకొనే వారికి ఈ సిరీస్‌ మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.

దాసున్ షానకా శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో బయో-బబుల్ ఉల్లంఘన కారణంగా కుశల్ మెండిస్ మరియు నిరోషన్ డిక్వెల్లాను సస్పెండ్ చేయగా.. మాజీ కెప్టెన్ కుశాల్ పెరెరా గాయం కారణంగా ఆడట్లేదు. ఇలాంటి స్థితిలో ఏమాత్రం అనుభవం లేని యువ ఆటగాళ్లపై పెను భారం పడనుంది. కొత్త ఆటగాళ్లతో కూడిన ఆ టీమ్‌ భారత్‌ను ఎదుర్కోవడం కష్టమే. మరోవైపు మ్యాచ్‌కు వరుణుడు బ్రేక్ వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తొలి వన్డే కోసం ఆశగా చూస్తున్న అభిమానుల్లో కలవరం మొదలైంది.

Tags

Read MoreRead Less
Next Story