పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది మృతి!

ఉత్తరప్రదేశ్‌లో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మొరాదాబాద్-ఆగ్రా హైవేపై హుస్సేన్‌పూర్ పులియా వద్ద ఓ బస్సు-మినీ ట్రక్కు ఢీకొన్నాయి.

పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది మృతి!
X

ఉత్తరప్రదేశ్‌లో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మొరాదాబాద్-ఆగ్రా హైవేపై హుస్సేన్‌పూర్ పులియా వద్ద ఓ బస్సు-మినీ ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రోడ్డుపై పొగమంచు కారణంగా వాహనం కన్పించక ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి చికిత్స అందించాలని అధికారులను ఆదేశించిన సీఎం యోగి.. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా మృతుల కుటుంబానికి 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 5 వేల ఆర్థికసాయం అందించనున్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.

Next Story

RELATED STORIES