పాముకెందుకో అంత పగ.. పాపం పది నెలల పసి బాలుడుని..

అమ్మ చేతిలో భద్రంగా ఉన్న అమాయకపు ఆ పసి బాలుడిని నిర్దాక్షణ్యంగా కాటేసి బాబు మృత్యువుకు కారణమైంది ఓ తాచుపాము.

పాముకెందుకో అంత పగ.. పాపం పది నెలల పసి బాలుడుని..
X

అమ్మ చేతిలో భద్రంగా ఉన్న అమాయకపు ఆ పసి బాలుడిని నిర్దాక్షణ్యంగా కాటేసి బాబు మృత్యువుకు కారణమైంది ఓ తాచుపాము. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. నాంపల్లి మండలం లక్ష్మణాపురం గ్రామానికి చెందిన బాణావత్ గణేష్- దివ్య దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం.. ఆదివారం సాయింత్రం పది నెలల కుమారుడు భవిత్‌ను తల్లి ఎత్తుకుని ఆడిస్తోంది.

కిటికీలో ఉన్న బొమ్మలు బాబుకు అందించేందుకు అక్కడికి వెళ్లింది. ఇంటి లోపలి గోడలు ప్లాస్టింగ్ చేయకపోవడంతో అప్పటికే ఇటుకల మధ్యలో దూరి ఉన్న తాచుపాము చిన్నారి కాలుపై కాటు వేసింది. పాము కాటుతో ఒక్కసారి ఉలికిపాటుకు గురైన బాబుని చూసి అటు తిరిగే లోపు మళ్లీ ఒకసారి కాటు వేసింది.

ఈ హఠాత్ పరిణామానికి భీతిల్లిన తల్లి కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి చిన్నారిని ఆస్సత్రికి తరలించే లోపే మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. చీకటి పడడంతో పాము బయటకు రాకుండా గ్రామస్థులు కాపలా కాశారు. పాములు పట్టే వ్యక్తిని పిలిపించి తాచుపామును పట్టించారు. అప్పటి వరకు కళ్ల ముందు కేరింతలు కొడుతూ అమాయకంగా అమ్మ కొంగు పట్టుకు తిరిగే ఆ చిన్నారి ఇక లేడని తెలిసి అమ్మ కన్నీరుమున్నీరవుతోంది.

Next Story

RELATED STORIES