తిరుపతిలో కిడ్నాపైన బాలుడు సాహు క్షేమం..!

గత నెల 27న తిరుపతి అలిపిరి చెక్‌ పోస్టు వద్ద బాలుడు కిడ్నాపయ్యాడు. కర్ణాటకకు చెందిన శివప్ప.. పిల్లాడికి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.

తిరుపతిలో కిడ్నాపైన బాలుడు సాహు క్షేమం..!
X

తిరుపతిలో కిడ్నాపైన బాలుడు సాహు కథ సుఖాంతమైంది. విజయవాడ దుర్గగుడి వద్ద బాలుడిని కిడ్నాపర్‌ వదిలివెళ్లాడు. దీంతో బాలుడిని గుర్తించిన విజయవాడ పోలీసులు.. అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం బాలుడు సాహుని చైల్డ్ హోమ్‌కు తరలించారు. రేపు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది. గత నెల 27న తిరుపతి అలిపిరి చెక్‌ పోస్టు వద్ద బాలుడు కిడ్నాపయ్యాడు. కర్ణాటకకు చెందిన శివప్ప.. పిల్లాడికి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవలే అనారోగ్యంతో శివప్ప కొడుకు చనిపోయాడు. ఈ నేపథ్యంలో పెంచుకునేందుకు ఓ అబ్బాయిని కిడ్నాప్ చేయాలని ప్రయత్నించి, పథకం ప్రకారమే సాహుని ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. పిల్లాడిని తీసుకువెళ్తున్న విజువల్స్‌ CC ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. 14 రోజుల అనంతరం బాలుడు దొరకడంతో పోలీసులు, తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

Next Story

RELATED STORIES