విజయవాడ: గన్‌మిస్‌ఫైర్‌ కేసులో కొత్త ట్విస్ట్

విజయవాడలో హోంగార్డు భార్య మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కావాలనే భార్య సూర్యరత్న ప్రభను హోంగార్డు హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.

విజయవాడ: గన్‌మిస్‌ఫైర్‌ కేసులో కొత్త ట్విస్ట్
X

విజయవాడలో హోంగార్డు భార్య మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కావాలనే భార్య సూర్యరత్న ప్రభను హోంగార్డు హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్యభర్తల గొడవ నేపథ్యంలోనే హత్య జరిగిందని విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. అతి దగ్గర నుంచి భార్యపై కాల్పులు జరపడంతో.. చేతి నుంచి ఛాతీ లోపలగా తూటా బయటకు వచ్చిందన్నారు. రెండున్నర లక్షల విలువైన బంగారాన్ని మణపురంలో వినోద్ తాకట్టు పెట్టాడని.. అన్న పెళ్లి కోసం ఆ బంగారం విడిపించాలని భార్య రత్నప్రభ కోరిందన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం పెద్దది కావడంతో సహనం కోల్పోయిన హోంగార్డ్.. తుపాకీతో కాల్చి చంపాడని తెలిపారు. ఏఎస్పీ వెపన్ హోంగార్డు దగ్గరకు వెళ్లటంపై చర్యలు తీసుకుంటామని సీపీ శ్రీనివాసులు చెప్పారు.

Next Story

RELATED STORIES