మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం కేసీఆర్‌ దిగ్బ్రాంతి!

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గూడురు(మ) మర్రిమిట్ట వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి.

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం కేసీఆర్‌ దిగ్బ్రాంతి!
X

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గూడురు(మ) మర్రిమిట్ట వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మృతులంతా గూడూరు మండలం ఎర్రకుంట్ల తండాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.. పని నిమిత్తం వరంగల్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు.

అయితే వారు ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. మృతుల్లో ఇటీవల పెళ్లి కుదిరిన యువతి కూడా ఉన్నట్టు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన పైన తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటు మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హామీ ఇచ్చారు.

Next Story

RELATED STORIES