అనాథ అంటూ మోసాలు... నిత్యపెళ్ళికూతురు అరెస్ట్..!

అనాథ అంటూ మోసాలు... నిత్యపెళ్ళికూతురు అరెస్ట్..!
అనాథ అంటూ నమ్మిస్తూ పెళ్లి పేరుతో డబ్బులు దోచుకుంటున్న నిత్య పెళ్లికూతురు సుహాసినిని చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు.

అనాథ అంటూ నమ్మిస్తూ పెళ్లి పేరుతో డబ్బులు దోచుకుంటున్న నిత్య పెళ్లికూతురు సుహాసినిని చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. విజయపురం మండలానికి చెందిన సునీల్ కుమార్ ఓ మార్కెటింగ్ శాఖాలో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న సుహాసిని అనాధ అంటూ పరిచయం చేసుకొని దగ్గరైంది. ఆ తర్వాత సునీల్ కుమార్ తన ఇంట్లో ఒప్పించి సుహాసినిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళిలో సుహాసినికి.. సునీల్ తల్లిదండ్రులు 10 తులాల బంగారం పెట్టారు. ఆ తర్వాత తనను చిన్నప్పటి నుంచి ఆదరించిన వారికి అవసరమని భర్త, అత్తమామల నుంచి రూ.6 లక్షలు తీసుకుంది. అయితే కొన్నిరోజుల తర్వాత డబ్బు విషయం పైన సునీల్ అరా తీయగా మరుసటి రోజే ఇంట్లోనుంచి వెళ్ళిపోయింది. దీనితో సునీల్ పొలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా అసలు విషయం బయటపడింది.

విచారణలో భాగంగా నెల్లూరుకు చెందిన మేనమామతో సుహాసినికి గతంలో వివాహమైందని, ఆమెకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తేలింది. అయితే తన గురించి సునీల్ అరా తీయడం మొదలు పెట్టాడని తెలుసుకున్న సుహాసిని అతనికి ఫోన్ చేసి తనకి ఇదివరకే పెళ్లి అయిందని చెప్పింది. దీంతో షాక్‌‌కి గురైన సునీల్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సుహాసినిని ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే .. సునీల్‌‌తో పాటుగా భాదితులలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వినయ్‌ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే సుహాసిని ఇదంతా తన మొదటి భర్త సహాయంతోనే చేస్తునట్టుగా విచారణలో వెల్లడైంది.

Also Read :

అప్పుల కుప్పలా ఆంధ్రప్రదేశ్..!

అతనికి 21, ఆమెకి 45.. నాలుగో పెళ్ళికి రెడీ.. నిలదీసిన ఐదుగురు కూతుళ్లు.. చివరికి ఇంకో ట్విస్ట్..!

పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. కోరిక తీరాక కులం తక్కువన్నాడు.. సాప్ట్‌వేర్ ఉద్యోగి నిర్వాకం

Tags

Read MoreRead Less
Next Story