రైలు కిందపడ్డా బతికాడు.. అయిషు గట్టిది..!

ఓ వృద్దుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బతికి బయటపడ్డాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది.

రైలు కిందపడ్డా బతికాడు.. అయిషు గట్టిది..!
X

ఓ వృద్దుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బతికి బయటపడ్డాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. కల్యాణ్ రైల్వే స్టేషన్‌‌లో పట్టాలు దాటి వెళ్లేందుకు ప్రయత్నించాడు ఓ వృద్దుడు.. అయితే అప్పటికే రైలు ముందుకు వస్తోంది. రైలును చూసిన ఆ వృద్దుడు కంగారులో అలాగే ఉండిపోయాడు. దీనిని గమనించిన లోకో ఫైలెట్ రైలు తక్కువ వేగం ఉన్నందున వెంటనే సడన్ బ్రేక్ వేశాడు. దీనితో రైలు వృద్ధుడిపైకి వెళ్లి ఆగింది. వృద్ధుడు ప్రాణాలతో ఉండటంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వృద్దుడిని పైకి లేపారు. వృద్ధుడి ప్రాణాలు కాపాడిన డ్రైవర్‌‌ని అంత అభినందించారు.


Next Story

RELATED STORIES