చైల్డ్ పోర్నోగ్రఫీకి చెక్ పెడుతున్న అమెరికన్ ఏజెన్సీ.. పోలీసులకు అందిన 16 మంది వివరాలు..

చైల్డ్ పోర్నోగ్రఫీకి చెక్ పెడుతున్న అమెరికన్ ఏజెన్సీ.. పోలీసులకు అందిన 16 మంది వివరాలు..
అడల్ట్ కంటెంట్లు, పోర్నోగ్రఫీ సైట్లు.. యూట్యూబ్‌లో విచ్చలవిడిగా పోస్టు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నామనుకుంటున్నారే కానీ

చిన్నారుల చేతుల్లో సెల్‌ఫోన్లు.. ఏం చేస్తున్నారో తెలియదు.. అదేమంటే ఆన్‌లైన్ క్లాసులంటారు. అమ్మానాన్న అస్తమాను కాపలా కాయలేరు.. ఇక వారి ఇష్టం.. అడ్డదారులు తొక్కేందుకు చేతిలో ఫోన్ చాలు. అడల్ట్ కంటెంట్లు, పోర్నోగ్రఫీ సైట్లు.. యూట్యూబ్‌లో విచ్చలవిడిగా పోస్టు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నామనుకుంటున్నారే కానీ వాటి వల్ల ఎంతమంది జీవితాలు నాశనమవుతుంటాయో ఒక్కసారి కూడా ఆలోచించరు.. తాజాగా ఓ అమెరికన్ ఏజెన్సీ పోర్నోగ్రఫీ సైట్లు చూసే వారికి చెక్ పెట్టే పనిలో పడింది.

సైట్స్ చూసే వారిని అడ్డంగా బుక్ చేస్తోంది. ఇండియాలో చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తే ఇట్టే పసిగట్టే విదేశీ ఏజెన్సీ మన చిన్నారులపై ఓ కన్నేయనుంది. ఐ.పి అడ్రెస్ ఆధారంగా వివరాలు సేకరించి ఎన్. సి .ఆర్.బి కి పంపుతుంది. ఆ వివరాలను సంబందిత రాష్ట్రాల సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేస్తుంది. సంబంధిత వివరాలతో కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగుతారు సైబర్ పోలీసులు. పిప్ లైన్ అనే ఈ సిస్టమ్ ద్వారా హైద్రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు 16మంది చిన్నారుల వివరాలు ఇప్పటి వరకు అందాయి. దీంతో కేసునమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. ఈ విధానంతో క్రైమ్ రేటు కొంతలో కొంతైనా అరికట్టవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story