అప్పా జంక్షన్ సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం అయ్యారు.

అప్పా జంక్షన్ సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
X

హైదరాబాద్‌ అప్పా జంక్షన్ సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం అయ్యారు. పాలకొల్లు నుంచి రొయ్యల లోడుతో ముంబై వెళ్తున్న కంటైనర్‌.. మితిమీరిన వేగంతో ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్‌కు మంటలు అంటుకున్నాయి.

కంటైనర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్లు సురేశ్‌, మృత్యుంజయ.. ఆ మంటల్లోనే సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదంతో ఔటర్ రింగు రోడ్డు వద్ద కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది.

Next Story

RELATED STORIES