క్రైమ్

Chanda Nagar: ప్రియురాలు హత్య కేసులో ట్విస్ట్.. ప్రియుడే గొంతుకోసి..

Chanda Nagar: నిన్న (మంగళవారం) హైదరాబాద్ పరిధిలో జరిగిన అమ్మాయి హత్య కలకలం రేపింది.

Chanda Nagar (tv5news.in)
X

Chanda Nagar (tv5news.in)

Chanda Nagar: నిన్న (మంగళవారం) హైదరాబాద్ పరిధిలో జరిగిన అమ్మాయి హత్య కలకలం రేపింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవట్లేదని నాగచైతన్య, కోటిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కానీ ఆ ప్రయత్నంలో అమ్మాయి నాగచైతన్య మాత్రమే చనిపోయింది. ప్రియుడు కోటిరెడ్డి ఒంగోలులోని ఓ హోస్పిటల్‌లో పోలీసుల కంటపడ్డాడు. అయితే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిసాయి.

వివరాలు.. ఒంగోలులోని జిన్స్‌ హాస్పిటల్‌లో నాగచైతన్య నర్స్‌గా పనిచేస్తుంది. కోటిరెడ్డి కూడా అక్కడే మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లకే వీరి పరిచయం ప్రేమగా మారింది. అలాంటి సమయంలోనే నాగచైతన్య తనను పెళ్లి చేసుకోవాలని కోటిరెడ్డిని అడగడం మొదలుపెట్టింది. పెళ్లి ఆలోచన లేని కోటిరెడ్డి.. నాగచైతన్యను తప్పించే ప్లాన్ వేశాడు.

23వ తేదీ ఏదో పని విషయంలో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌కు వచ్చాడు కోటిరెడ్డి. ఆ తర్వాత నాగచైతన్యను కూడా హైదరాబాద్‌కు రమ్మని చెప్పి ఓయో రూమ్‌కు తీసుకెళ్లాడు. ఇద్దరు ఆ రాత్రి అక్కడే ఉన్నారు. ఉదయం లేవగానే కోటిరెడ్డి ఒక్కడే ఆ గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. రాత్రి 10.30కు ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో గాయాలతో అడ్మిట్ అయ్యాడు.

రాత్రి అయినా ఇంకా వెళ్లిన కోటిరెడ్డి తిరిగి రాకపోవడం, గదికి తాళం వేసి ఉండడం గమనించిన హోటల్ సిబ్బంది అనుమానం వచ్చి తాళాలు పగలగొట్టి చూశారు. అక్కడ రక్తపు మడుగులో ఉన్న నాగచైతన్య శవం వారికి కనిపించింది.

నాగచైతన్యకంటే ముందే హైదరాబాద్‌కు వచ్చిన కోటిరెడ్డి తనను హత్య చేయడానికి కత్తి, తాడు కొన్నాడు. ఓయో రూమ్‌కు వెళ్లిన తర్వాత ఇద్దరు కలిసి వోడ్కా సేవించారు. ఆ తర్వాత మరోసారి వారిద్దరికి పెళ్లి విషయంలో గొడవ జరిగింది. అప్పుడే ప్లాన్ ప్రకారం కోటిరెడ్డి.. నాగచైతన్య గొంతుకోసి హత్య చేశాడని ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోంది. ఆ తరువాత ఫ్యాన్‌కు ఉరివేయాలని ప్రయత్నించిన కుదరలేదని పోలీసులు తెలిపారు.

కోటిరెడ్డి సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని నాగచైతన్యను వివాహం చేసుకునేందుకు అతడి కుటుంబ సభ్యులు నిరాకరించి ఉంటారని తెలుస్తోంది. దళిత కులానికి చెందిన యువతి కావడంతో కోటిరెడ్డి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా ఒంగోలుకు వెళ్లిన సిటీ పోలీసులు అతడిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES