పెళ్లి పీటల మీదే కుప్పకూలిన వధువు.. శవం ఎదుటే వధువు చెల్లికి తాళి కట్టిన వరుడు..!

Uttar Pradesh : మరికొద్ది నిమిషాల్లో పెళ్లి అనగా మండపంలో వరుడి ఒడిలోనే నవ వధువు త‌నువు చాలించింది.

పెళ్లి పీటల మీదే కుప్పకూలిన వధువు.. శవం ఎదుటే వధువు చెల్లికి తాళి కట్టిన వరుడు..!
X
Uttar Pradesh : మరికొద్ది నిమిషాల్లో పెళ్లి అనగా మండపంలో వరుడి ఒడిలోనే నవ వధువు త‌నువు చాలించింది. దీనితో మండపంలోనే ఆమె మృతదేహాన్ని పక్కన ఉంచి బాధితురాలి చెల్లితో వివాహం జరిపించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఎటావా జిల్లాలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పెళ్లి కొడుకైనా మంజేష్ పెళ్లి కుమార్తెనా సుర‌భి మెడ‌లో తాళిక‌ట్టాల్సి ఉంది. అయితే సరిగ్గా ముహూర్త సమయానికి వ‌ధువు సుర‌భి పెళ్లి పీఠ‌ల‌పై కుప్పకూలింది. దీనితో వెంటనే వైద్యులు మండపంలోనే ఆమెకి వైద్యపరీక్షలు నిర్వహించారు. అయితే ఆమె గుండెపోటుతో మృతిచెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. దీంతో అదే పెళ్లి మండ‌పంలో వ‌రుడికి మృతురాలు చెల్లెలు నిషాతో వివాహం జ‌రిపించారు. పెళ్లి కార్యక్రమం ముగిసిన తర్వాత సుర‌భి అంత్యక్రియ‌లు నిర్వహించారు.
Next Story

RELATED STORIES